వామ్మో! దేశంలో 4 లక్షలు దాటిన కేసులు..
ఇక 57,640 కేసులతో మహారాష్ట్ర, 50,112 కేసులతో కర్ణాటక, 41,953 కేసులతో కేరళ, 31,111 కేసులతో ఉత్తర ప్రదేశ్, 23,310 కేసులతో తమిళనాడు ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల నుండి ఎక్కువగా కొత్త కేసులు 49.52 శాతం నమోదవుతున్నాయి, మహారాష్ట్ర మాత్రమే కొత్త కేసులలో 13.98 శాతానికి దోహదపడింది. మహారాష్ట్రలో 920 మంది మరణించారు, ఉత్తర ప్రదేశ్ లో 353 మంది మరణించారు. గత 24 గంటల్లో 3,29,113 డిశ్చార్జెస్ చేయబడ్డాయి, దేశంలో మొత్తం కోలుకున్న వారి కేసుల సంఖ్య 1,72,80,844 కు చేరుకుంది. క్రియాశీల కేసు 35,66,398 వద్ద ఉంది. ప్రస్తుతం దేశంలో మరణించిన వారి సంఖ్య 23,01,68 కు చేరుకుంది.
అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రలకు కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ పెట్టుకోమని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ పెట్టుకున్నప్పటికిని కేసులు మాత్రం తగ్గట్లేదు. ఇక కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలని మీ జాగ్రత్తలో మీరు ఉండాలని మొత్తం వారిపైనే భారం వేస్తుంది. కాని ప్రజలు ఇక్కడ తిట్టుకుండేది కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే. కాబట్టి కేంద్రం ఇవన్నీ మానేసి కరోనాని కట్టడి చెయ్యడానికి కృషి చెయ్యాలి.