సైన్యం దెబ్బ.. కాశ్మీర్ లో ఖతం అయ్యారు?

praveen
భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లో ఎప్పుడు ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంటుంది. పాకిస్తాన్ అక్రమంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని  ఉల్లం గించి ఇక భారత సరిహద్దుల్లో ప్రవేశించడం భారత ఆర్మీ ఇక ఉగ్రవాదులను మట్టుబెట్టడం లాంటివి జరుగుతూ ఉంటుంది.  ఇలా ఎప్పుడూ పాకిస్తాన్ భారత్ సరిహద్దులో మినీ యుద్ధమే జరుగుతుంది అని చెప్పడంలో అతిశ యోక్తి లేదు. అయితే ఇలా రోజు రోజుకు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగిపోతున్నాయి.

 ఇక ఈ మధ్య కాలంలో అయితే భారత ఆర్మీ ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో ఎంతో వ్యూహత్మకంగా వ్యవహరిస్తుంది ఉగ్రవాదులకు భారత్ లో ప్రవేశించి ఇక కుట్ర పన్నెందుకు ఎక్కడ అవకాశం ఇవ్వడం లేదు భారత్. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సరిహద్దుల నుంచి అక్రమంగా భారత్ లోకి అడుగుపెడుతున్న ఉగ్రవాదులను గుర్తించి ఎక్కడికక్కడ ఎన్కౌంటర్ చేస్తూ మట్టుబేడుతుంది. ఇటీవలి కాలంలో కేవలం రోజుల వ్యవధిలోనే వందల సంఖ్యలో ఉగ్ర వాదులను భారత సైన్యం మట్టుబెట్టింది.  ఉగ్రవాదులను కనిపెట్టేందుకు ఎన్నో రకాల ఆపరేషన్స్ నిర్వహించి ఎక్కడికక్కడ కాల్చిపారేస్తు ఉంది భారత ఆర్మీ.

 ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఒక సీరియస్ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది  పోషియాన్ జిల్లాలో ముగ్గురూ టెర్రరిస్టులను హతమార్చింది భారత సైన్యం   ఓ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారు అన్న సమాచారంతో రంగంలోకి దిగిన భారత సైన్యం ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని కనిపెట్టింది. ఈ క్రమంలోనే భారత ఆర్మీ పై ముష్కరులు ఒక గ్రానైట్ విసరగా వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం దీటుగా స్పందించారు. వెంటనే కాల్పులకు దిగడంతో ఇక ముగ్గురు టెర్రరిస్టులు కూడా ఎన్ కౌంటర్ లో చనిపోయారు. కొంత మంది టెర్రరిస్టులు అక్కడి నుంచి పారిపోగా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: