ఈటల విషయంలో మరింత వ్యూహాత్మకముగా అడుగులేస్తున్న కేసీఆర్ ?
ఈటల రాజేందర్ మాటల మూలంగానే ఇదంతా జరిగిందని కొందరంటున్నారు. గతంలో ఒక మీడియా సమావేశంలో భాగంగా తెరాస పార్టీ జెండాకు మేమే యజమానులం అని అనడం కారణంగానే కేసీఆర్ కక్ష గట్టారని రాజేందర్ వర్గాలు భావిస్తున్నాయి. కేసీఆర్ తన అధికారాన్ని ఉపయోగించి ఈటలను పద్మవ్యూహంలో బంధించడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టంగా అర్ధమవుతోంది. ఇందులో భాగంగానే దేవరయాంజల్ లోని సీతారామ దేవాలయ భూముల్ని ఆక్రరమించారన్న ఆరోపణల్ని హైలైట్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈటల మీడియాతో మాట్లాడిన తీరు ఎక్కడా కూడా కేసీఆర్ ను నిందించే విధంగా లేదు.
కేవలం తనకు జరిగిన అన్యాయాన్ని మరియు ఆవేదనను మాత్రమే మీడియాతో పంచుకుంటున్నారు. తద్వారా ప్రజలకు కూడా ఈయనపై సానుభూతి కలిగేలా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. కాగా కేసీఆర్ కూడా ఈటలను పార్టీ నుండి నిషేధించే విషయంలోనూ వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈటలను పార్టీనుండి నిషేధిస్తే ఇప్పుడున్న ప్రజాస్పందనలో మరింతగా ఎదిగిపోతాడని బావిస్తుండడమే దీనికి కారణం కావొచ్చు. తనకై తానుగా పార్టీ నుండి తప్పుకుంటే తప్ప కేసీఆర్ నిషేధించేలా కనిపించడం లేదు. మరి రానున్న రోజుల్లో ఏమి జరగనుందో చూడాలి.