"భావప్రకటనా స్వేచ్చ" పై కోర్ట్ లో రగడ ... ?

VAMSI
మన భారతదేశంలో పౌరుడిగా జీవిస్తున్న ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వాతంత్య్రపు హక్కు ఉంది. రాజ్యాంగంలో పొందుపరిచిన ఇటువంటి హక్కులు కేవలం మంచి కోసం మాత్రమే ఉపయోగించబడాలి. అంతే కానీ ఎవ్వరికీ ఇబ్బంది కలిగేలా ఉండకూడదు. అయితే గతంలో కావొచ్చు లేదా మొన్న జరిగిన ఎన్నికల్లో కావొచ్చు. ఎప్పుడైనా రాజకీయాల్లో భాగంగా ఎక్కువగా ఈ వాక్ స్వాతంత్య్రం హద్దులు దాటుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఎలక్షన్ సంఘాన్ని ఉద్దేశించి కూడా చేసిన వ్యాఖ్యల గురించి మనకు తెలిసిందే. గతంలో న్యాయస్థానం ఎన్నో సార్లు, ఎలక్షన్ సంఘం తీసుకునే నిర్ణయాలలో మేము జోక్యం చేసుకోలేము అని చెప్పింది. ఈ విధంగా గతంలో ఆంధ్రప్రదేశ్ లోనే ఎన్నో పర్యాయాలు జరిగాయి. ఏపీలో ఎన్నికల సంఘం పైన పిటిషన్ లు కూడా వేశారు. కానీ వీటిని సుప్రీం కోర్ట్ కొట్టివేసింది.
అయితే ఇదే విధంగా మొన్న తమిళనాడులో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల వేళ ఎలక్షన్ సంఘాన్ని ఉద్దేశించి కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఈ విమర్శలపై చెన్నై హై కోర్ట్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే రాజ్యాంగంలోని ఈ హక్కు ప్రకారం రాజ్యాంగ బద్దంగా నియమితులైన వారిని దూషించవచ్చా ? ఉదాహరణకు ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని ఇలా ఎవ్వరినైనా అనొచ్చా ? అలా అయితే న్యాయవ్యవస్థలు కూడా రాజ్యాంగ బద్దంగా నడుస్తున్నాయి. కాబట్టి న్యాయవ్యవస్థలను కూడా తమకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడొచ్చా ? ఇక్కడ వీరు చెబుతున్న ప్రకారం న్యాయమూర్తులను వారి పేర్లను చెప్పి దూషించడం ముమ్మాటికీ తప్పే అంటున్నారు. ఇటువంటి వాటిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చని చెప్పడం జరిగింది.  ఈ విధంగా న్యాయవ్యవస్థ తీరుపై  చేసిన వ్యాఖ్యలు ఎలా తీసుకోవాలి ? ఈ అంశంపై ఎవ్వరైనా ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తారా చూడాలి.
మొన్న ఆర్టీసీ సమ్మెల విషయంలో కోర్టు తెలంగాణ ప్రభుత్వానికే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇప్పుడు చెన్నై విషయంలో కూడా ఇదే విధంగా జరిగే అవకాశం ఉంది. రేపు సిబిఐ విచారణ జరిగితే కానీ అసలు విషయం తెలియదు. అయితే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ భావప్రకటన స్వేచ్ఛ విషయంలో ఎలా ముందుకెళ్లాలి. ఎవ్వరు ఈ స్వేచ్చా హక్కును వినియోగించుకోవచ్చు ? ఎవ్వరు వినియోగించుకోవడానికి వీల్లేదు ? కేవలం కొంతమందికే ఈ స్వేచ్చా హక్కును ఆపగలిగే అవసరం ఉందా ? ఇలా పలుకోణాల్లో ఈ విషయం చర్చకు దారితీస్తోంది. ముందు ముందు ఒక వ్యవస్థ ఇంకొక వ్యవస్థ మీద ఎన్ని వ్యాజ్యాలు వేసుకుంటుందో చూడాలి. లేదా ఇంకెన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: