గాల్లో కోవిడ్ ఎంత దూరం ప్రయానిస్తుందంటే..
నిజానికి నాలుగు గోడల మధ్య ఉండేవారికే కరోనా ఎక్కువగా సోకే అవకాశం ఉందట.కోవిడ్ పాజిటివ్ గా తేలిన వ్యక్తి కి దగ్గర్లో ఉంటే ఖచ్చితంగా కరోనా సోకే ప్రమాదం ఉందట.ముఖ్యంగా సరైన వెంటిలేషన్ లేని ప్రాంతాల్లో ఒక గది నుంచి మరో గదిలోకి కూడా ఈ ఏరోసోల్స్ వెళ్లగలవు. అందుకే పాజిటివ్‌గా తేలిన వ్యక్తి ఉంటే ఇంట్లో కూడా మాస్కులు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. సెమినార్ హాల్స్, కాన్ఫరెన్స్ గదులు, హాస్పిటల్ వార్డులు, ఇంట్లో సరైన వెంటిలేషన్ లేని గదుల్లో ఇవి ఐదారు మీటర్ల వరకూ సులభంగా వెళ్ళగలవు.నిజానికి ఇంట్లో ఉండటం కంటే బయటే కరోనా తక్కువ సోకుతుందట. ఎందుకంటే తాజా గాలి కాని సూర్య రశ్మి కిరణాలు ఈ ఏరోసోల్స్‌ను త్వరగా చంపేస్తాయి. గాల్లోని కరోనా వైరస్ పార్టికల్స్‌లో 90 శాతాన్ని సూర్య కిరణాలు ఏడు నిమిషాల్లోపే చంపేసినట్లు నిర్ధారణ అయ్యింది.
కోవిడ్ సోకినప్పటి నుంచి నుంచీ కనీసం రెండు మీటర్ల భౌతిక దూరం పాటించాలని నిపుణులు తెలుపుతున్నారు. దీనికి ఓ బలమైన కారణం ఉంది. కరోనా సోకిన వ్యక్తి ద్వారా బయటకు వచ్చే వైరస్ పార్టికల్స్ రెండు మీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లలేవు. ఆ తర్వాత అవి భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల కింద పడిపోతాయి. అలా పడిన ఉపరితలంపై వైరస్ 3 నుంచి 4 గంటల పాటు ఉంటుంది. ఇలా ఇన్ఫెక్ట్ అయిన ప్రాంతాలను ఫోమైట్స్ అంటారు.అయితే వైరస్ సోకిన వ్యక్తి మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, శ్వాస తీసుకున్నప్పుడు తుంపర్లు రెండు మీటర్ల కంటే ఎక్కువ వెళ్లలేవు. కానీ ఏరోసోల్స్‌గా పిలిచే కొన్ని వేల సంఖ్యలో సూక్ష్మ తుంపర్లు రెండు మీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లగలవు. దీనినే గాలి ద్వారా వ్యాప్తి చెందే వైరస్‌గా పిలుస్తున్నారు. ఈ ఏరోసోల్స్ గాల్లో 18 అడుగులు అంటే 5.5 మీటర్ల వరకూ కూడా ప్రయాణించగలవని ఒక అధ్యయనం తేల్చింది. కాబట్టి మాస్కులు ధరించండి. భౌతిక దూరం ఖచ్చితంగా పాటించండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.