అమిత్ షాను అరెస్ట్ చేసిన ఆఫీసర్ కు ప్రమోషన్.. !
అంతే కాకుండా మొన్నటిదాకా సీఎంగా ఉన్న ఎడప్పాటి పళనిస్వామి మరియు ఆయన మంత్రులపై అవినీతి ఆరోపణలు చేస్తూ డీఎంకే నేతలు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కు ఎన్నో కంప్లైంట్ లు చేశారు. కానీ గవర్నర్ పట్టించుకోలేదు. విజిలెన్స్ విభాగానికి కంప్లైంట్ చేసినా వారు కూడా పట్టించుకోలేదు. అయితే గవర్నర్ కేంద్రప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారిని...కేంద్రంలో ఉన్న బీజీపీతో అన్నా డీఎంకే కు మంచి సంబంధాలుండటంతో కంప్లైంట్ లు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నది డీఎంకే కాబట్టి లెక్క తేలుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కందస్వామి గతంలో సీబీఐలో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా చేశారు. మరోవైపు కేరళలో SNC-లావాలిన్ స్కామ్‌లో పినరయ్ విజయన్‌ని దర్యాప్తు చేశారు. ఇలా మంచి ట్రాక్ రికార్డు ఉన్న కందస్వామి అన్నా డీఎంకే మంత్రులపై ఫోకస్ పెట్టబోతున్నారని తెలుస్తుంది.