ఆంబులెన్స్ లో శవం.. అంతలో నిద్రలోకి డ్రైవర్.. చివరికి?

praveen
తెలంగాణ రాష్ట్రం లో రోజు రోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇలాంటి నేపథ్యం లో అటు రాష్ట్ర ప్రజానీకం మొత్తం బెంబేలెత్తి పోతున్నారు. అయితే వైరస్ బారిన పడిన ఎంతోమంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు తలెత్తుతూ నేపథ్యం లో ఇక ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ఈ క్రమం లోనే అక్కడ సరైన సదుపాయాలు లేక ఆక్సిజన్ కొరత కారణంగా ఎంతో మంది చివరికి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా వెలుగు లోకి వస్తున్నాయి.


 అంతే కాదు తెలంగాణ లోని వివిధ ఆస్పత్రు లలో కొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక ఇలాంటి విమర్శలు అన్ని నిజమే అనడానికి నిదర్శనంగా కొన్ని ఘటనలు కూడా వెలుగు లోకి వస్తున్నాయ్. ఇటీవలే ఓ ఘటన వెలుగులోకి వచ్చి సంచలనంగా మారిపోయింది  ఇటీవలే ఓ అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.  ఏకంగా ఆంబులెన్స్ లో ఒక మృతదేహం ఉన్నప్పటి కీ కూడా అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం గా వ్యవహరిస్తూ దాని ముందే నిద్రకు ఉపక్రమించిన ఘటన ప్రస్తుతం అందరినీ అవాక్కయ్యేలా చేసింది.


 హైదరాబాద్లోని సంతోష్ నగర్ పీఎస్ పరిధి లో ఈ ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ డ్రైవర్ నిర్వాకం అందరినీ కంగు తినేలా చేస్తుంది. ఇటీవలే ఉస్మానియా ఆస్పత్రి లో మృతి చెందిన మహిళ మృతదేహాన్ని అంబులెన్స్లో పెట్టుకుని వారి కుటుంబ సభ్యులకు అప్పగించకుండా ఒకచోట ఆంబులెన్స్ నిలిపి వేసి అక్కడే నిద్రపోయాడు డ్రైవర్. ఇక ఆ తర్వాత ఆంబులెన్స్ నుంచి దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ డ్రైవర్ ని ప్రశ్నించగా అప్పటికే అంబులెన్స్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: