లాక్ డౌన్ హంబక్కేనా?
కానీ నైట్ కర్ఫ్యూ వల్ల కేసులు తగ్గకపోవడంతో ఎందుకు మరిన్ని ఆంక్షలు విధించడం లేదని చాలా రోజులుగా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది.. అయినా సరే తెలంగాణలో లాక్ డౌన్ పెట్టడం ఇష్టం లేదని అలా పెడితే ఆర్థికంగా మళ్ళీ వెనుక పడతామని పేర్కొన్న కేసీఆర్ అనూహ్యంగా ఇప్పుడు ఈ నిర్ణయం వెలువరించడంతో లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తారా లేక నైట్ కర్ఫ్యూ లాగానే అంతా హంబక్కేనా అనే చర్చ జరుగుతోంది.
ఇక లాక్డౌన్లో నిత్యావసరాలతో పాటుగా మద్యం దుకాణాలను కూడా తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణాలతో ఆదాయం తగ్గకుండా ఈ చర్యలు చేపట్టిందని అంటున్నారు. పాలు, కూరగాయల దుకాణాలతో పాటుగా మద్యం దుకాణాలను కూడా ఉదయమే తెరిచి ఉంచుకోవాలని సూచిస్తోంది. ఇక చూడాలి మరి ఈ లాక్ డౌన్ వలన కరోనా కేసులు తగ్గుతాయో లేదో అనేది.