రెండు మూడు నెలల్లో జనసేనలో కీలక పరిణామాలు...?

భారతీయ జనతా పార్టీ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు ఏంటనేది స్పష్టత రావడం లేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా ఒక ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్తున్నారు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమి పాలైంది. నాగార్జునసాగర్ ఎన్నికల్లో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కారణంగా జనసేన పార్టీ కూడా ఎక్కువగా నష్ట పోయిన సంగతి తెలిసిందే.
కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్లడం ద్వారా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనే  అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీని పూర్తిగా పక్కన పెట్టకపోతే మాత్రం జనసేన కార్యకర్తలు కూడా ముందుకు వెళ్లే అవకాశాలు లేకపోవచ్చు అనే అభిప్రాయం కూడా కొంతమందిలో వ్యక్తమవుతున్నది. రాజకీయంగా ఉన్న కొన్ని కొన్ని కారణాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్న సరే భవిష్యత్తులో మాత్రం కొన్ని ఇబ్బందులు జనసేన పార్టీకి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
జనసేన పార్టీలో ఉన్న చాలామంది నాయకులు కూడా సఖ్యత లేకుండా ముందుకు వెళుతున్నారు అనే  అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. బిజెపి విషయంలో చాలామంది జనసేన పార్టీ నాయకులకు వేరు అభిప్రాయాలు ఉన్నాయని బీజేపీతో ఉండటం వల్ల తాము రాజకీయంగా నష్టపోయామనే భావనలో ఉన్న జనసేన పార్టీ నేతలు ఉన్నారని కొంతమంది ఇప్పుడు పార్టీ మారిపోయే అందుకు కూడా రెడీ అవుతున్నారని కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అలాంటి వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. రాబోయే రెండు మూడు నెలల్లో జనసేన లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: