ఇజ్రాయెల్ కు షాక్ ఇచ్చిన పాలస్తీనా ?
పాలస్తీనాలో జీవించే ప్రజలంతా తీవ్రవాదులు కాదు, అలాగే ప్రజలు అందరూ తీవ్రవాదులకు మద్దతుగానూ నిలబడరు. కానీ ఉగ్రవాదులు మాత్రం ఈ ప్రజలను అడ్డం పెట్టుకుంటారు మరియు ఉపయోగించుకుంటున్నారు. అయితే ప్రజలు చేసే తప్పేమిటంటే ఆ తీవ్రవాదులను తిప్పికొట్టడం లేదు. ఇలా చేయకపోవడం వల్ల పాలస్తీనాకు చాలా ఇబ్బందిగా మారింది. అయితే ఈ వివాదం మొత్తానికి ప్రధాన కారణం ఏమిటని చూస్తే, అల్ హక్సా మసీదుకు సంబంధించిన వివాదంగా తెలుస్తోంది. ఒకప్పట్లో ఈ స్థలంలో యూదుల నిర్మాణాలు ఉండేవి. కానీ వీరు ఆ నిర్మాణాలను పడగొట్టేసి , మసీదును నిర్మించారట. ఇప్పటికీ యూదులు దీనికి సంబంధించిన ఆధారాలను చూపెడుతూ ఉంటారు.
ఇజ్రాయెల్ అంటే యూదుల దేశమే. కానీ ఇది రంజాన్ మాసం కావడం వలన పాలస్తీనాకు చెందిన నిజమైన పౌరులు, దేవుని యందు నిజమైన భక్తి, విశ్వాసం ఉన్న వారు ప్రార్ధనల కోసం మసీదుకు వెళ్లడం జరిగింది. కానీ అంతకు ముందే హమాస్ ఉగ్రవాదులు భక్తుల లాగా మసీదులోకి చొరబడి మైకులలో ఈ భూభాగం మాది, మీరంతా ఈ దేశాన్ని వదిలి వెళ్లిపోండని అక్కడ నివసిస్తున్న యూదులైన ఇజ్రాయెల్ ప్రజలను హెచ్చరించారు. దీనితో గొడవ మొదలయింది. కానీ పాలస్తీనా వాళ్ళు ప్రాణాలు పోతాయని కూడా లెక్క చేయకుండా ప్రార్ధనలు చేయడానికి వచ్చారు. అంతే కాకుండా ఇజ్రాయెల్ కి ఒక సంకేతాన్ని పంపించారు. ఇక్కడ ఉన్న వారంతా తీవ్రవాదులు కాదు. ఇక్కడకు మేము వచ్చిన కారణం అయితే ప్రార్ధనలు చేసుకోవడానికి మాత్రమే అని వివరణ ఇచ్చారు. ఈ విషయంలో వారిని అభినందించాలి. ఈ వ్యాఖ్యలతో ఇజ్రాయెల్ కు షాక్ ఇచ్చినట్లయింది.