కరోనాను జయించిన 25 రోజులు చిన్నారి.. ధైర్యం నింపుతున్న ఘటన?

praveen
కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తుంది. రోజురోజుకు ప్రమాదకర రీతిలో అందరిపై పంజా విసురుతు బెంబేలెత్తిస్తోంది మహమ్మారి వైరస్ వైరస్. దేశ ప్రజానీకం మొత్తం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.  ఇక మొదటి దశ వైరస్ తో పోల్చి చూస్తే రెండవ దశ వైరస్ వేగంగా వ్యాప్తి చెందటమే ఎక్కువగా ప్రభావం చూపుతుంది.  ఇలాంటి నేపథ్యంలో పరిస్థితులు దేశంలో రోజురోజుకు అధ్వానంగా మారిపోతున్నాయి.  ముఖ్యంగా చిన్నారులపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా చూపుతోంది.



 ఇప్పటికే ఎంతో మంది చిన్నారులు ఇక ఈ మహమ్మారి వైరస్ బారినపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు ఏ క్షణం లో వైరస్ పంజా విసురుతుందో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. అయితే ఇటీవలే ఇక్కడ జరిగిన ఘటన మాత్రం అందరిలో ధైర్యాన్ని నింపుతుంది.  వైరస్ బారిన పడితే చిన్న పిల్లలకు ఏమవుతుందో అని ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు అందరిలో కొత్త ఊపిరి నింపుతుంది ఇక్కడ జరిగిన ఘటన.


 ఏకంగా ఇరవై ఐదు రోజుల పసికందు కరోనా వైరస్ బారినపడి ఈ మహమ్మారి వైరస్ ను జయించింది. ఈ ఘటన ఒడిషాలో వెలుగులోకి వచ్చింది. కలహండి జిల్లా రాంపూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఇటీవలే చత్తీస్ ఘడ్ లోని రాయపూర్ లో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఆ తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి తల్లి బిడ్డ ఇంటికి చేరుకున్నారు. కాని అంతలోనే ఇంట్లో కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురి కావడంతో అందరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు



 ఈ క్రమంలోనే ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న వాళ్లందరికీ కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో భవాని పట్నా లో ఉన్న ఐసొలేషన్ కేంద్రంలో అందరూ చేరారు. అక్కడి నుంచి భువనేశ్వర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తల్లి బిడ్డలను తరలించారు. ఈ క్రమంలోనే ఇక 20 రోజుల పాటు చికిత్స పొందిన తల్లీబిడ్డలు ఇటీవలే కరోనా వైరస్ నుంచి కోలుకున్నట్లు పరీక్షల్లో తేలింది.  ఐదు రోజుల వయస్సు ఉన్న ఆ చిన్నారి కరోనా వైరస్ బారిన పడడంతో ఐసీయూలో ఉంచి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ వైద్యం అందించామని ఇక ఇప్పుడు నెగిటివ్గా తేలడంతో డిశ్చార్జ్ చేసామని వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: