బాబు అమెరికా పర్యటన రద్దు వెనుక ఇంత కథ నడిచిందా ?
దీనికి సంబంధించి కుటుంబ సమేతంగా అమెరికా పర్యటనకు డేట్లు కూడా ఫిక్స్ చేసుకున్నారు. మే తొలివారం నుంచి అమెరికాలో పర్యటించి జూన్ చివరి వారంలో రావాలని నిర్ణయించుకున్నారు. దీంతో పార్టీ బాధ్యతలను దాదాపు ఆయన కుమారుడు లోకేష్ చేతిలో పెడుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే.. అనూహ్యంగా బాబు అమెరికా పర్యటన వాయిదా పడింది. ఇప్పట్లో ఆయన పర్యటన ఉండేలా లేదని టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. దీనివెనుక.. పలు రీజన్లు ఉన్నాయని అంటున్నారు.. సీనియర్లు.
అమెరికా ప్రభుత్వం భారతీయుల రాకపోకలపై నిషేధం విధించింది. దీంతో చంద్రబాబు పర్యటన వాయి దా పడిందని పైకి ప్రచారంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. రాష్ట్రంలో రాజకీయంగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు ఇప్పుడున్న పరిస్థితిని మించిన పరిస్థితి లేదని చంద్రబాబు భావిస్తున్నట్టు.. ఎక్కువ మంది లెక్కలేసుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో బాధితులను ఆదుకోవడంలో జగన్ సర్కారు విఫలమైందని.. అందుకే.. ఈ సమయం మించిపోతే.. అద్భుతమైన అవకాశాన్ని కోల్పోతామని.. బాబు భావించినట్టు ప్రచారం సాగుతోంది.
ఇక, ఇదే సమయంలో వైసీపీ సర్కారు నుంచి టీడీపీపై ఎదరు విమర్శలు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే.. కీలకమైన కరోనా సమయంలో అందునా.. రాష్ట్రంలో విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు బాధ్యతాయుత ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు విదేశాలకు వెళ్లిపోయారంటూ.. వైసీపీ నేతలు.. టార్గెట్ చేసే అవకాశం ఉందని.. అందుకే చంద్రబాబు అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారని.. టీడీపీలోని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి బాబు అమెరికా వెళ్లినా.. రద్దు చేసుకున్నా.. ఆసక్తికర రాజకీయాలు సాగుతుండడం గమనార్హం.