జగన్ - రఘురామ మధ్య వివాదానికి కారణం ఆ సంఘటనే ?

VAMSI
ప్రస్తుతం ఏపీలో నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు అరెస్ట్ తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ విషయంపై పెద్దగా చర్చ ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రతిరోజూ మీడియాతో వైసీపీ గురించి, ప్రభుత్వం గురించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం మరియు మతాలకు, కులాలకు వ్యతిరేకంగా దుర్భాషలాడడం చూస్తూనే ఉన్నాము. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ ప్రతిష్టకు మరియు గౌరవానికి భంగం కలిగేలా ఉన్నాయని అభియోగాలు రావడంతో నిన్న హైద్రాబాద్ లో సిఐడి అరెస్ట్ చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో ఒకటే చర్చ రఘురామ రాజు ఎందుకు ఇంతలా ప్రభుత్వాన్ని మరియు సొంత పార్టీని ద్వేషిస్తున్నాడు అనే విషయంపై అందరికీ చాలా సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ సీఎం జగన్ అంటే ఎంపీ రాజు కి నచ్చలేదు అనుకుంటే, ఈ విధంగా మాట్లాడడం వలన ఉపయోగంలేదు.
ఇంకేమైనా కారణములు ఉన్నాయా అని చూస్తే, కొన్ని విషయాలు రాజకీయ విశ్లేషకులు బయటపెట్టడం జరిగింది. అవేమిటో చూద్దాం. గతంలో 2014 ఎన్నికలకు ముందు రఘురామ రాజు టీడీపీలో జాయిన్ అయ్యాడు. ఆ సమయానికి ఈయన ఎస్బిఐ కి సంబంధించిన సిబిఐ కేసుల్లో ఇరుక్కుని ఉన్నారు. ఆ కేసు జరుగుతూ ఉంది. ఒకటేమో తీసుకున్న లోనును కట్టకుండా మోసం చేయడం మరియు ఇంకొకటి నకిలీ పత్రాలు సమర్పించి లోను తీసుకోవడం. ఇది కాకుండా తమిళనాడులో ఒక థర్మల్ పవర్ ప్లాంటును ప్రభుత్వానికే అమ్మడానికి ప్రయత్నం చేశారు. కానీ చివరి నిమిషంలో కేవలం కమిషన్ ఇవ్వలేక ఆగిపోయిందని, పైగా ఈ కమిషన్ ను ఇవ్వను అని చెప్పడానికి సోనియా గాంధీ పర్సనల్ సెక్రటరీ పేరును కూడా వాడుకున్నాడని ఒక వాదన దీనిపై ఉంది. ఆ కారణంతోనే థర్మల్ ప్లాంట్ అమ్మకం ఆగిపోయింది. ఆ తర్వాత 2017 లో శ్రీకాకుళం జిల్లా భావనపాడు దగ్గర టీడీపీ ప్రభుత్వం సాయంతో రెండు 660 మెగావాట్లను ఉత్పత్తి చేయగల ప్లాంట్లను కొనడానికి ప్రతిపాదనలు జరిగాయి.
కానీ రఘురామ కృష్ణం రాజు మీద నమ్మకంలేని చంద్రబాబు దానిని అక్కడే ఆపేశారు. అప్పటికే రఘురామ కృష్ణం రాజు వైసీపీ నుండి బీజేపీకి, మళ్ళీ బీజేపీ నుండి టీడీపీ ఇలా పార్టీలు మారి ఉన్నారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని తెలిసిన రాజు, అంతకు ముందు జగన్ ను నోటికొచ్చినట్లు తిట్టిన విషయాలను కూడా పట్టించుకోకుండా రాజకీయ స్వార్ధం కోసం ప్రశాంత్ కిషోర్ టీం సాయంతో వైసీపీ లో కలిశారు. వైసీపీ గెలిచాక మళ్ళీ టీడీపీ ప్రభుత్వంలో కొనాల్సిన ప్రాజెక్టును కొనమని అడిగినట్లుగా ప్రచారం జరిగింది. కాకపోతే పర్యావరణ చట్టం ప్రకారం కర్బన పధార్ధాలతో  కూడిన విద్యుదుత్పత్తిని ఆపేయాలి. ఇకపైన ఇలాంటివి కొత్తవి మొదలుపెట్టకుండా, ఉన్నవాటినే  తగ్గించుకోవాలని కేంద్రం చెప్పింది. పైగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చింది.  దీనితో కొత్త రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి బొగ్గు ఆధారిత ప్లాంట్ లను కొనడం లేదు ప్రోత్సహహించడం లేదు. ఈ సందర్భాల నడుమ రఘురామకృష్ణం రాజు కొనని చెప్పడం వల్ల, అక్కడే వీరిద్దరి మధ్య వివాదానికి తొలి అడుగు పడినట్లుగా చెప్పుకుంటూ ఉన్నారు. ఈ సంఘటనతోనే వీరిద్దరి మధ్య వైరం మొదలైనట్లుగా తెలుస్తోంది.  రఘురామకృష్ణం రాజు దీనిని బయటకు తెలియనివ్వకుండా, ఈయనపై ఎలాగూ కేసులున్నాయి కాబట్టి, దానిని రూపుమాపుకోవడానికి జగన్ పై పోరాటయోధుడిగా తనను తాను చిత్రీకరించుకున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఏది నిజమో తెలియాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: