మ్యాట్రిమోని లో వివరాలను సేకరించి.. గర్ల్స్ తో ఎరవేసి..

Satvika
మ్యాట్రిమోని లో ఈ మధ్య మోసాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. సైబర్ నేరగాళ్లు వీటిని కూడా వదలట్లేదు.. వారికి కావలసిన ఇన్ఫర్మేషన్ తీసుకొని డబ్బులు గుంజె ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి వాటికి చిక్కి ఎందరో అబ్బాయిలు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పోలీసులకు ఈ ఘటనలు రోజు రోజుకు పెద్ద సమస్య గా మారుతున్నాయి. దాంతో పోలీసులు రంగం లోకి దిగి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు ఈ సమస్య లో చిక్కుకున్నాడు.


వివరాల్లోకి వెళితే..మ్యాట్రీమోనీ సైట్లలో డీటైల్స్ పెట్టడం చాలా కామన్. అలాంటి వారి సమాచారం తీసుకొని.. కేటుగాళ్లు మాయ చేయడం గమనార్హం. తాజాగా.. ఓ యువకుడి సమాచారాన్ని మ్యాట్రిమోని సైట్ల నుంచి సేకరించి.. అతనికి ఓ అమ్మాయి తో ఎరవేసి.. రూ.లక్షలు గుంజేశారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.. మెట్ట గుడాకు చెందిన విక్రమ్‌ అనే యువకుడి కి ఇటీవల ఓ విదేశీ ఫోన్‌ నెంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. తన పేరు పమేలా బిందే అని, యూకే లో స్థిరపడిన ఎన్నారై కుటుంబం అంటూ నమ్మించింది.


నీకు అంగీకారమైతే ఇద్దరం పెళ్లి చేసుకుందామంటూ ముగ్గులోకి దింపింది, పెళ్లి కూడా ఇండియా లోనే చేసుకుందామని, ఖర్చులు, ఇతరత్రా కోసం కోట్ల లో డబ్బులు పంపిస్తామని నమ్మించి, తన పనిని కానించ్చింది.తర్వాత ఎయిర్‌ పోర్టు నుంచి కస్టమ్స్‌ అధికారులమంటూ ఫోన్‌ చేసి యువకుడి నుంచి రెండు దఫాలు గా రెండు లక్షల కు పైగా డబ్బును ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు. ఫోన్లు స్విచ్చాఫ్‌ వస్తుండటం తో మోసపోయాన ని తెలుసుకొని సైబర్ పోలీసుల ను ఆశ్రయించారు.. అతని వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. ఇటువంటి మోసాలను నమ్మి మోస పోవద్దని హెచ్చరించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: