మాయదారి దొంగలు.. చివరికి వాటిని కూడా వదల్లేదే?

praveen
దేశంలో రోజురోజుకు వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అయితే మొదటి రకం వైరస్ తో పోల్చిచూస్తే రెండవ రకం వైరస్ అంతకు మించి అనే రేంజిలో వ్యాప్తి చెందుతుంది. దీంతో దేశం మొత్తం అల్లాడిపోతోంది. రోజురోజుకు దేశంలో వెలుగులోకి వస్తున్న కేసుల సంఖ్య చూస్తుంటే ఇక దేశంలో పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోతున్నాయి అని అర్థమవుతుంది. అయితే వైరస్ ను కంట్రోల్ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎక్కడ వైరస్ కేసులు సంఖ్య మాత్రం తగ్గడం లేదు.



 ఇకపోతే ప్రస్తుతం రెండవ దశ కరోనా వైరస్ ఎంతగానో ప్రభావం చూపుతుంది. తద్వారా ఎంతో మందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు తలెత్తి ఇక ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ఇలా ఆసుపత్రిలో చేరిన అందరికీ కూడా తప్పనిసరిగా ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దేశవ్యాప్తంగా రోజురోజుకు ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోతున్నాయి. ఇలా ఆక్సిజన్ కొరత ఏర్పడుతుందని భక్తులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇలా   ప్రస్తుతం ఆక్సిజన్ సిలిండర్ లకి ఎంతగానో డిమాండ్ ఏర్పడింది. భారీ మొత్తంలో ఎంతోమంది ఆక్సిజన్ సిలిండర్ ను తీసుకోవడానికి కూడా వెనకాడటం లేదు.



 ఇలా భారీగా డిమాండ్ ఏర్పడిన ఆక్సిజన్ సిలిండర్లపై అటు దొంగల కన్ను కూడా పడినట్లు తెలుస్తుంది. సాధారణంగా అయితే దొంగలు ఒక ఇంట్లో చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలు ఎత్తుకు పోతుంటారు. కానీ ప్రస్తుతం బంగారం కంటే విలువైనది... ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టేది..  మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది ఆక్సిజన్ సిలిండర్ కాబట్టి ఇక ఆక్సిజన్ సిలిండర్లు చోరీకి కూడా వెనకాడలేదు.  ఇటీవలే ఝార్ఖండ్ హజారీబాగ్ జిల్లా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఏకంగా 200 ఆక్సిజన్ సిలిండర్ లు చోరీ చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారిపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: