కోవిడ్ వాక్సిన్ వేసుకునే వారు ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి. !
అయితే వ్యాక్సినేషన్‌కు ముందు, ఆ తర్వాత శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని వైద్య నిపుణులు అంటున్నారు.అలాగే వ్యాక్సినేషన్ సమయంలో కొన్ని రకాల ఆహార పదార్ధాలకు కూడా దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.ఎవరయితే వాక్సిన్ వేయించుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు టీకా వేయించుకునే కొన్ని రోజుల ముందు పసుపు, వెల్లుల్లి, అల్లం, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలి.
అలాగే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బ్లూ బెర్రీస్, చికెన్/వెజిటబుల్ సూప్, డార్క్ చాక్లెట్, ఆలివ్ నూనె, బ్రకోలిని ఆహారంలో భాగం చేసుకోవాలి..అంతేకాకుండా ధూమపానం, మద్యపానం, ఖాళీ కడుపుతో వ్యాక్సిన్ వేయించుకోవడం, కెఫిన్ ఉన్న డ్రింక్స్ తీసుకోవడం లాంటివి వ్యాక్సినేషన్ సమయంలో అస్సలు చేయకూడదని హెచ్చరించారు. అలాగే కరోనా వాక్సిన్ అనేది 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు వేయించుకోవాలి.టీకా కోసం కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్య సేతు లేదా ఉమాంగ్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రులే కాకుండా, ప్రైవేట్ టీకా కేంద్రాలలో కూడా వ్యాక్సిన్ అందుబాటులో కలదు. !