దేశంలో థర్డ్ వేవ్.. అక్కడినుండేనట?
ఇలాంటి తరుణంలో అటు మూడవ దశ కరోనా వైరస్ కూడా ఉంటుంది అని ఇప్పటికే పలువురు నిపుణులు చెప్పడం అటు దేశ ప్రజలందరి లో ప్రాణ భయం కలిగిస్తోంది. మొదటి దశ వైరస్ తో పోల్చి చూస్తే రెండవ దశనే భయంకరంగా ఉందని.. ఇక ఇప్పుడు మూడవ దశ అంటే ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో అని అందరూ బెంబేలెత్తిపోతున్నారు. ఇక ఈ రెండవ దశ ముగిసేలోపే మూడవ దశ కూడా ప్రారంభం అవుతుందని ఇప్పటికే ఎంతో మంది నిపుణులు హెచ్చరిస్తున్నారు అందుకే ప్రతి ఒక్కరు ఎన్నో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది అంటూ సూచిస్తున్నారు.
ఇక మూడవ దశ కరోనా వైరస్ గురించి ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే పరిశోధకులు సింగపూర్ లో చిన్న పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపే కరోనా వేరియంట్ గుర్తించారు. ఈ వేరియంట్ పై స్పందించిన కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సింగపూర్లో చిన్నపిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతున్న కరోనా వేరియంట్ మరికొన్ని రోజుల్లో థర్డ్ వేవ్ గా అంతటా వ్యాప్తి చెందే అవకాశం ఉంది అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేసిన కేజ్రీవాల్ ఇక సింగపూర్ నుంచి వచ్చే అన్ని రకాల విమానాలను రద్దు చేయాలంటూ కోరారు. అంతేకాకుండా చిన్నారులకు వ్యాక్సిన్ అందించే ప్రక్రియ పై మరోసారి ఆలోచన చేయాలి అంటూ కోరారు డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.