టీకాల తయారికి 9 కంపెనీలకు కేంద్రం అనుమతి...
ప్రస్తుతానికి కేంద్రం.. భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్, సీరం తయారీ కొవిషీల్డ్ తోపాటు రష్యా వారి స్ఫుత్నిక్-వి వ్యాక్సిన్లకు మాత్రమే భారత్ లో అనుమతిచ్చింది. దేశంలో తయారయ్యే కొవాగ్జిన్, కొవిషీల్డ్ ఉత్పత్తి సామర్థ్యం అవసరాలకు సరిపడినంతగా లేకపోవడంతో వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. ఇక ఈ దశలో వ్యాక్సిన్ల ఉత్పత్తిపై కేంద్ర ప్రభుత్వం పాజిటివ్ వార్తని వెల్లడించింది. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ల ఉత్పత్తి కోసం దేశంలో 9 కంపెనిలకు అప్రూవల్ ఇచ్చింది. డిసెంబర్ నాటికి దాదాపు 261 కోట్ల వ్యాక్సిన్ డోస్ లు ఉత్పత్తి చెయ్యాలని మోడీ ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఇప్పటికే కొంతమంది వ్యాక్సిన్ లు తీసుకుంటున్నారు. ఇక డిసెంబర్ నాటికి ఇంకా తీసుకొని వారు 90 శాతం నుంచి 100 శాతం రికవరీ కేసులు అయ్యేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇక డిసెంబర్ నాటికి పూర్తిగా ప్రజలు కరోనా మహమ్మారి నుంచి రికవరీ అయ్యేలా చేస్తామని మోడీ గవెర్నమెంట్ తెలిపింది.