బ్లాక్ ఫంగస్: రూ.314 ఇంజెక్షన్‌ రూ.50 వేలకు ... ముఠా అరెస్ట్ ?

VAMSI
కరోనా వైరస్ తో ఇబ్బంది పడలేక ప్రజలంతా ఆందోళన చెందుతుంటే ఒక వారం రోజులుగా బ్లాక్ ఫంగస్ వ్యాధి దేశమంతా కలకలం రేపుతోంది. ఆ వ్యాధి పట్ల ఇప్పటికే అప్రమత్తమైన ప్రభుత్వాలు నివారణ కోసం చికిత్సా మార్గాలను కనుగొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన చికిత్స తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని హాస్పిటల్స్ లో అందుబాటులో ఉంది. పైగా ఇది అంటువ్యాది కాదని డాక్టర్స్ నిర్ధారించారు. ఇది కరోనా నుండి కోలుకున్న వారిలో రోగనిరోధక శక్తి తగ్గడం వలన ఈ వ్యాధి ఎటాక్ అవుతున్నట్లు గుర్తించారు. ఇది ఇలా ఉంటే బ్లాక్ మార్కెట్ అంతకంతకూ పెరిగిపోతోంది. మొన్నటకు మొన్న కరోనాకు ఉపయోగించే రెమెడీసివెర్ ను బ్లాక్ మార్కెట్ లో ఎంత రేట్లకు అమ్ముకున్నారో తెలిసిందే.

ఇప్పుడు వీరి గురి బ్లాక్ ఫంగస్ ను నివారించడంలో కీలకంగా మారిన ఔషధాన్ని సైతం అక్రమమగా అమ్ముకునేందుకు రెడీ అయిపోయారు. అయితే ఈ సారి డాక్టర్స్ కూడా ఈ దుర్మార్గపు వ్యవహారంలో భాగమవ్వడం ఆశ్చర్యకరంగా ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్న హైద్రాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 5 మంది బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లను పట్టుకున్నారు. వీరి నుండి 5 ఇంజక్షన్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన విషయాలను ఓఎస్డీ రాధాకిషన్ రావు మీడియాకు తెలిపారు. ఈ బ్లాక్ ఫంగస్ వ్యాధి పెరుగుతుండడంతో, దీనికి డిమాండ్ పెరిగిందని అందుకే వీరు ఈ విధంగా చేస్తున్నట్లు తెలిసింది.

కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి ఒక ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ రవితేజతో చేయి కలిపి ఆంపోటెరిసీన్‌ బీ ఇంజక్షన్ లను అక్రమంగా సంపాదించారు. ఈ ముఠాలో మొత్తం 5 మంది ఉన్నారు. వీరిలో 2 డాక్టర్లు కావడం విశేషం. ప్రస్తుతం వీరికి సహాయం చేసిన రవితేజ అనే డాక్టర్ పరారీలో ఉన్నాడు. ఈ ఆంపోటెరిసీన్‌ బీ ఇంజక్షన్ ధర 314 రూపాయలు కాగా వీరు రోగుల పరిస్థితిని వాడుకుని 50 వేల రూపాయలకు అమ్మడానికి ప్రయత్నించారు. కాబట్టి ప్రజలు అంతా అవగాహన పెంచుకోండి. ఒక్క హాస్పిటల్ లో దొరికే మందులనే వాడండి. ఇలా అక్రమార్కుల చేతిలో మోసపోకండి అని పోలీసులు వారికి సలహాలు ఇస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: