ఏపీ బడ్జెట్: మహిళలు - చిన్నారుల సంక్షేమానికి పెద్ద పీట ..

VAMSI
ఏపీ అసెంబ్లీ ఒక్కరోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ 2021-22 వార్షిక బడ్జెట్‌ను  సమర్పించారు. ఈ బడ్జెట్ లో మహిళలకు మరియు చిన్నారులకు ప్రత్యేక ప్రాముఖ్యతను కల్పిస్తూ నివేదికను ప్రవేశపెట్టారు. జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటినుండి పేద ప్రజలకు, మహిళలకు ఎక్కువ లబ్ధి చేకూరేలా సంస్కరణలు చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చిన్నారులకు కూడా పెద్ద పీట వేయడం విశేషం. తద్వారా మహిళలకు మరియు చిన్నారులకు ఇకనుండి విద్యా,  వైద్య, ఉపాధి ఇలా అన్ని రంగాలలోనూ ప్రత్యేక వెసులుబాటు కలగనుంది. ఈ విధంగా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ లో మహిళలకు మరియు చిన్నారులకు ప్రత్యేకించి కేటాయింపులు చేయడం అందరూ హర్షించదగ్గ విషయం.


 రైతులకు కూడా బడ్జెట్ ప్రణాళికలో అధిక ప్రాధాన్యత ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇక ప్రస్తుతం ఏపీ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో  కోవిడ్ పై పోరుకు వెయ్యి కోట్లను కేటాయించింది. దీని ద్వారా రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టేందుకు మరిన్ని చర్యలు  చేపట్టబోతున్నారు. ఇక మొత్తం ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ అంచనా.. రూ.2,29,779.27 కోట్లుగా ఉందని పేర్కొన్నారు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్. పిల్లల విషయంలో జగన్ ప్రభుత్వం చాలా బాధ్యతగా వ్యవహరిస్తోంది. పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్థికి అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్య అందించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.


 ఇందుకోసం విద్యా రంగానికి - రూ.24,624.22 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులో భాగంగా వివిధ పధకాలు వర్తించనున్నాయి.

పాఠశాలల్లో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు
జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు
జగనన్న విద్యాకానుకు కోసం రూ.750 కోట్లు
ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు ....అయితే గత బడ్జెట్ లో విద్యకోసం రూ. 22,604.01 కోట్లు మాత్రమే కేటాయించి ఉన్నారు. దానితో పోలిస్తే ఈ సారి కాస్త ఎక్కువగానే కేటాయించారు.  కాగా మహిళలు మరియు చిన్నారుల సంరక్షణకు కూడా అధిక బడ్జెట్ ను కేటాయించారు.  చిన్నారుల కోసం బ‌డ్జెట్‌లో రూ.16,748 కోట్లు. మ‌హిళ‌ల అభివృద్ధికి రూ.47,283.21 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్ తో మహిళలను అభివృద్ధి చేసే దిశగా వివిధ పధకాలను అమలు చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: