బ్లాక్ ఫంగస్: ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి ?

VAMSI
ఓ వైపు దేశంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తూ ఉంటే, కొత్తగా మరో వైపు బ్లాక్ ఫంగస్ వ్యాధి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ తో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలవరపెడుతోంది. కరోనా సెకండ్ వేవ్ తో దేశం అల్లాడుతున్న సమయంలో ఈ బ్లాక్ ఫంగస్ ప్రమాదకరంగా మారుతోంది. అయితే కరోనా నుండి కోలుకున్న కొందరిలో 10 రోజుల నుండి మూడు నెలల లోపు ఈ ఫంగస్ లక్షణాలు బయట పడుతున్నాయి. దీన్ని వెంటనే గుర్తిస్తే ప్రమాద స్థాయికి చేరుకోకుండా చికిత్స అందించి నయం చేయవచ్చంటున్నారు డాక్టర్లు. అయితే బ్లాక్ ఫంగస్ పై పలు రకాల ప్రశ్నలు ప్రజల్ని వెంటాడుతున్న సందర్భంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి అంటున్నారు వైద్య నిపుణులు అవేంటో ఇప్పుడు చూద్దాం.

* బ్లాక్ ఫంగస్ అనేది అంటు వ్యాధి కాదు. ఇది ఒకరి నుండి మరొకరికి సోకదు.

* డయాబెటిస్ నియంత్రణలో లేని కరోనా బాధితులు ఎక్కువగా  బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు.

*చికిత్సల కోసం ఇమ్యునిటీ కంట్రోల్ డ్రగ్స్ ఎక్కువగా వినియోగించిన రోగుల్లో  ‘బ్లాక్ ఫంగస్’  కనిపిస్తోంది.

* బ్లాక్ ఫంగస్ లక్షణాలు కళ్లు ఎర్రబడడం, ముఖం వాపు, తిమ్మిరులు, ముఖంపై నొప్పి, కళ్ళు ముక్కు చుట్టు పక్కల భాగంలో ఎర్రబడడం, నాలుకపై లేదా ముక్కుపై నల్ల మచ్చలు, ఒక వైపు దవడ వాయడం, కంటిచూపు మందగించినట్లు అనిపించడం వంటివి లక్షణాలుగా గుర్తించాలి. ఇలాంటివి కనిపిస్తే వెంటనే ఈ ఎన్ టి డాక్టర్ ను సంప్రదించాలి అని చెబుతున్నారు ప్రముఖ వైద్య నిపుణులు.

* తొలి దశలోనే కనుక ఈ లక్షణాలు గుర్తించినట్లయితే చికిత్స చేయవచ్చు అంటున్నారు. అలాగే ఆలస్యమయ్యే కొద్దీ ఈ ప్రమాదం పెరుగుతున్నట్లే అని గుర్తు చేస్తున్నారు.


అయితే ప్రభుత్వం దీనిని నియంత్రించటానికి వేగవంతంగా చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: