లవర్ పెళ్ళి ఆపమని సీఎంకే ట్వీట్..!
అమ్మాయి ప్రియుడు. అయితే ఆ సమయంలోనే ఆ ప్రేమికుడుకి ఒక వినూత్న ఆలోచన వచ్చింది.ఇక వెంటనే దాన్ని అమలు చేసేసాడు. ప్రియురాలి పెళ్ళి ఆపమని ఏకంగా సీఎంకే లెటర్ రాసేసాడు మనోడు.ఏమని రాసాడు అని ఆలోచిస్తున్నారా.అసలు వివరాలలోకి వెళితే.
ఈ సంఘటన బీహార్ లో జరిగినది.అక్కడ కరోనా కారణముగా లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర సీఎం ట్విట్టర్ ద్వారా లాక్ డౌన్ విషయం ప్రజలకు తెలియ చేసారు. మే 16 నుంచి మే 25 వరకు లాక్ డౌన్ విధించనున్నట్లు ప్రకటించారు.ఇలా లాక్ డౌన్ ను ప్రజలు అందరూ పాటించి, ఇంటికే పరిమితం అవ్వడం వల్ల కరోనా మహమ్మారిని తగ్గించవచ్చని సీఎం తెలిపారు. అలాగే మన అందరికి సానుకూల ఫలితాలు వస్తాయని ఈ ట్విట్ లో పొందుపరిచాడు.
అయితే ఈ ట్వీట్ ను చుసిన ఒక యువకుడు రీట్వీట్ చేశాడు.ఏమని అంటే మీరు లాక్ డౌన్ అయితే పెట్టారు కానీ లాక్ డౌన్ వేళ పెళ్లిళ్లు చేసుకోవద్దని మాత్రం చెప్పలేదు.మే 19 వ తారీఖున నా ప్రియురాలి పెళ్లి ఉంది. కనుక మీరు లాక్ డౌన్ అమలులో ఉన్న కారణం చేత పెళ్లిళ్లపై కూడా నిషేధం విధిస్తే తన ప్రియురాలి పెళ్లి ఆగిపోతోంది.ఇలా పెళ్లిళ్లపై నిషేధం విధిస్తే ఎప్పటికి మీకు రుణ పడి ఉంటానని అతను తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.మరి ఈ ప్రేమికుడు ఆవేదనను సీఎం అర్ధం చేసుకుంటాడో లేదో అనేది వేచి చూడాలి మరి. !