టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో టాప్
డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు
డైరెక్టర్ వైవీఎస్ చౌదరి.సినిమా కాన్సెప్ట్ అనేది ఎలా ఉన్నా కూడా ఒక సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ మొత్తం చూసేలా తెరకెక్కిస్తుంటారు ఈ డైరెక్టర్. అలాంటి దర్శకుడు యాక్షన్ చెప్పి దాదాపు ఆరేళ్లవుతోంది. ఇక ఫైనల్ గా ఇన్నాళ్లకు తన పుట్టినరోజు సందర్భంగా
గుడ్ న్యూస్ చెప్పారు.త్వరలోనే ఒక
లవ్ స్టోరీతో రాబోతున్నాడట ఈ దర్శకుడు..20 ఏళ్ళకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వైవిఎస్.చౌదరి చాలా మంది స్టార్స్ తో వర్క్ చేశారు. సహాయక దర్శకుడిగా ఉన్నప్పుడు
గుణశేఖర్,
రవితేజ వంటి వారితో కలిసి రూమ్ కూడా షేర్ చేసుకున్నారు.
అప్పట్లో వీళ్ళందరు కూడా చాలా క్లోజ్ గా ఉండేవారు. కలిసి
సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవారు.ఇక వైవిఎస్.చౌదరి వైవిఎస్.చౌదరి
హరికృష్ణ తో చేసిన సీతయ్య
సినిమా అప్పట్లో
బారి విజయాన్ని అందుకుంది. లాహిరి లాహిరి లాహిరిలో.., యువరాజు, సీతారామరాజు, వంటి విభిన్నమైన సినిమాలను తెరకెక్కించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు.ముఖ్యంగా
రామ్ పోతినేని నటించిన మొదటి
సినిమా దేవదాసు వైవిఎస్.చౌదరి దర్శకత్వంలోనే తెరకెక్కింది. ఆ
సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది.
రామ్,
ఇలియానా కెరీర్ లకు కూడా బాగానే హెల్ప్ అయ్యింది.అయితే మధ్యలో కొన్ని సినిమాల వల్ల వైవిఎస్.చౌదరి భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.ఇక అప్పుడెప్పుడో
సాయి ధరమ్ తేజ్ తో తీసిన రేయ్ అనంతరం మళ్ళీ సినిమాలు చేయని వైవిఎస్.చౌదరి ఇన్నాళ్లకు మరొక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. నేటి తరానికి అర్ధమయ్యేలా సరికొత్త
లవ్ స్టోరీని సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నేడు వైవిఎస్.చౌదరి పుట్టినరోజు కావడంతో ఆయన మళ్ళీ ఫామ్ లోకి రావాలని కోరుకుంటూ.. ఆయనకి బర్త్ డే విషెస్ ని అందజేస్తున్నారు అభిమానులు..!!