మాజీ టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్ సబబేనా ?
కానీ ఇప్పుడు జరిగిన అరెస్ట్ ను చూస్తే నిన్న సాయంత్రం దాడికి పాల్పడిన కారణంగా ఈ అరెస్ట్ జరిగిందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నటు తెలుస్తోంది. ఇప్పటి వరకు కక్ష గట్టి అరెస్టు చేస్తున్నారు అనే ఆరోపణలమీద టీడీపీ ఏమి చెబుతుందో తెలియాల్సి ఉంది. వైసీపీ కార్యకర్త కోనేటి దుర్గాప్రసాద్, ఈయన కాటసాని అనుచరుడు. ఈయనపై తీవ్రస్థాయిలో దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. రోడ్డుమీద పడేసి కొట్టడం జరిగిందని తెలుస్తోంది. దీని కారణంగానే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అది పనిగా ప్లాన్ చేసి మరీ రాడ్ లతో దాడి చేశారనే విషయం క్లియర్ గా తెలుస్తూ ఉంది.
సదరు వ్యక్తి వారి నుండి తప్పించుకుని వెళుతున్నా కూడా వదలకుండా వెంటపడి కొట్టడం జరిగింది. ఇప్పటికే ఈ వీడియో టీడీపీ నాయకుల వరకు చేరి ఉంటుంది. ఇంత దారుణంగా కొట్టిన తరువాత కూడా దాడికి కారణమయిన వారిని అరెస్ట్ చేయక ? నిలబెట్టి పాలాభిషేకం చేయాలా ? అంటూ నెటిజన్లు మరియు రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.