భార‌త్‌లో 2023వ‌ర‌కు వ్యాక్సిన్ల కొర‌త‌..?

Suma Kallamadi
ఇప్పుడు దేశంలో సెకండ్ వేవ్ ఏ స్థాయిలో ఉందో చూస్తూనే ఉన్నాం. ఈ క‌రోనాను ఎదుర్కోవ‌డానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్ర‌మే. కానీ మ‌న దేశంలో వ్యాక్సిన్ల కొర‌త తీవ్రంగా ఉంది. కొవాగ్జిన్‌, కొవీషీల్డ్ డోసులు స‌రిపోయేంత సంఖ్య‌లో ఉత్ప‌త్తి కావ‌ట్లేదు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు వ్యాక్సిన్ టార్గెట్‌ను రీచ్ కాలేక‌పోయింది కేంద్రం. దీంతో ఇప్పుడు ప్ర‌పంచం వైపు చూస్తోంది. అయితే అవికూడా సుముఖంగా లేన‌ట్టు తెలుస్తోంది.

అయితే బ‌య‌ట దేశాల్లో పంపిణీ చేస్తున్న ఫైజ‌ర్‌, మోడెర్నా వ్యాక్సిన్ల‌కు ఆల్రెడీ వంద‌ల మిలియ‌న్ల‌లో ఆర్డ‌ర్లు ఉండ‌టంతో.. ఆ సంస్థ‌లు ఇండియాకు వ్యాక్సిన్ల‌ను పంపిచ‌లేమ‌ని చెప్పాయి. క‌నీసం రెండేళ్లు ప‌డుతుంద‌ని చెబుతున్నాయి.అంటే భారత్ లో 2023 వరకు ఈ టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడంలేదు. ఇప్పటివరకు బుక్ చేసుకున్న దేశాలకు టీకాలు సరఫరా చేసేందుకే ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ల‌కు మరో రెండేళ్లు పట్టనుంది.

ఇక్క‌డ ఓ విష‌యం ఏంటంటే.. ఫైజ‌ర్ త‌న వ్యాక్సిన్ ప‌ర్మిష‌న్ కోర‌గా ఎం-ఆర్ఎన్ఏ కేటగిరీకి చెందినదంటూ నిపుణుల కమిటీ దాన్ని తిరస్కరించింది. దీంతో మ‌న దేశంలోకి రాలేదు. అయితే ఫైజర్ టీకా ఇంకోసారి అప్లై చేసేందుకు కూడా ఆసక్తి చూపించలేదు. ఇప్పుడేమో కావాల‌ని కేంద్రం కోరినా.. వీలు కాద‌ని ఆ సంస్థ చెప్పేసింది. అంటే మ‌న‌చేతులారా మ‌న‌మే అవ‌కాశం చేజార్చుకుందని చెప్పాలి.  

కొవిడ్‌ను అంచ‌నా వేసిన ప్ర‌భుత్వం ఎలాగైనా అంద‌రికీ వ్యాక్సిన్లు వేయాల‌ని చూస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇతర దేశాల్లో ఇస్తున్న వ్యాక్సిన్లకు భారత్ లో 2, 3వ దశ క్లినికల్ ట్రయల్స్ అవసరం లేకుండా డైరెక్ట్ వేయొచ్చ‌ని ప్రకటన చేసింది. కానీ, అప్పటికే ఆలస్యం అయింది. ఫైజర్, మోడెర్నా కంపెనీలు త‌మ వ్యాక్సిన్ల కోసం అనేక దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయ‌ని చెప్పేశాయి. దీంతో ఇప్పుడు దేశంలో రెండేళ్ల వ‌ర‌కు కొర‌త ఉంటుదని అంచనా వేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: