కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు. కరోనా ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో వేలమంది మరణిస్తుండగా వారిలో మహిళలకంటే పురుషులే ఎక్కువగా చనిపోతున్నారు అంటూ చెబుతున్నారు వైద్య నిపుణులు. కరోనా తొలిదశలోనూ ఈ మాట చాలా సార్లు విన్నాము. అయితే ఇప్పుడు నివేదిక అందిస్తూ నిజమే అంటున్నారు కొందరు వైద్య శాస్త్రవేత్తలు. అమెరికాలోని మిస్సౌరీలోని సెయింట్ లూయిస్ లోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆప్ మెడిసిన్ పరిశోధకులు ఈ కోణంలో అధ్యయనం చేయగా మహిళలతో పోలిస్తే పురుషుల్లో టెస్టోస్టెరాన్ తక్కువగా ఉండడమే దీనికి కారణం అని ఖచ్చితంగా చెప్పలేము. కానీ టెస్టోస్టిరాన్ తగ్గిన వారిలో మాత్రం కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుందని వారి అధ్యయనం ద్వారా తెలిసినట్లు పేర్కొన్నారు.
విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అభినవ్ దివాన్ జామా నెట్ వర్క్ ఓపెన్ అనే పత్రికలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ అధ్యయనం ద్వారా టెస్టోస్టిరాన్ తక్కువ ఉండే వారికి మాత్రం అత్యవసర చికిత్స అవసరం అయిందని గుర్తించినట్లు వారు పేర్కొన్నారు. మామూలుగా వయోజన పురుషుల్లో 250 గ్రాములు కన్నా తక్కువ నానో గ్రాములు ఉంటే తక్కువ టెస్టోస్టెరాన్ ఉన్న పురుషులగా పరిగణలోకి తీసుకుంటామని వారు వెల్లడించారు. ఇక ఈ నేపథ్యంలో పరిశోధన జరిపారు. ఈ అధ్యయనం కోసం 90 మంది పురుషులు, 62 మంది మహిళల నుంచి రక్తనమూనాలు సేకరించి పరిశోధన జరిపినట్లు వెల్లడించారు.
పురుషుల్లో కరోనా సోకిన మొదట్లో 151 నానోగ్రాములు ఉండగా , కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న వారిలో ఆ సంఖ్య భారీగా తగ్గింది అంటున్నారు. 53 నానో గ్రాములు మాత్రమే ఉంటున్నట్లు పరిశోధనలో గుర్తించినట్లు వారు పేర్కొన్నారు. అయితే రక్తంలో టెస్టోస్టిరాన్ అతి తక్కువ స్థాయికి చేరితే మాత్రం వెంటిలేటర్స్ అవసరమయ్యే స్థాయికి వారు చేరుకునే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ అధ్యయనం ద్వారా వారు చెబుతోంది ఏంటంటే, పురుషులకే ఎక్కువుగా ఈ ప్రమాదం పొంచి ఉన్న అవకాశాలు ఉన్నట్లు వారు భావిస్తున్నారు. అందుకే కరోనా కారణంగా మహిళలు కన్నా పురుషులే అధికంగా చనిపోతున్నారు అని నిర్ధారణకు వచ్చారు.