ఎన్టీఆర్ మామకు నెక్స్ట్ లైన్ చేస్తారా?

M N Amaleswara rao

2019 ఎన్నికల ముందు జగన్ వేవ్ చూసి చాలామంది వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. పలువురు వ్యాపార, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం వైసీపీలో చేరారు. అయితే అలా చేరినవారిలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు కూడా ఉన్నారు. ఎన్నికల ముందు ఈయన వైసీపీలో చేరారు. అప్పుడే నార్నే వైసీపీ తరుపున పోటీ చేయొచ్చని ప్రచారం జరిగింది.


చిలకలూరిపేట లేదా అద్దంకి నియోజకవర్గాల నుంచి నార్నే పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఒకానొక సమయంలో నారా లోకేష్‌పై కూడా పోటీ చేస్తానని నార్నే ప్రకటించారు. జగన్ గెలుపు కోసం కృషి చేస్తానని స్ట్రాంగ్‌గానే చెప్పారు. చంద్రబాబుని ఓడించాలని ప్రజలని కోరారు. అలాగే ప్రజలు బాబుని ఓడించి, జగన్ గెలిపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ నార్నే ఇంతవరకు పార్టీలో కనిపించలేదు. ఎన్నికలై రెండేళ్ళు అయిపోయినా సరే రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు. 


అయితే నార్నే సొంత వ్యాపారాలు చూసుకోవడంలోనే బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. పైగా వైసీపీలో కూడా నార్నేకు కీలక పదవులు ఏమి రాలేదు. అటు ప్రభుత్వంలో కూడా నార్నేకు పదవులు దక్కలేదు. దీంతో ఏపీ పోలిటికల్ స్క్రీన్‌పై నార్నే కనిపించడం లేదు. ఇక రానున్న రోజుల్లో నార్నే రాజకీయాల్లో కనిపిస్తారో లేక సైడ్ అయిపోతారో అనే విషయంపై క్లారిటీ రావడం లేదు.


ఒకవేళ మళ్ళీ రాజకీయాల్లో కనిపిస్తే, ఈసారి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అనేది కూడా చెప్పలేని పరిస్తితి. అయితే నార్నే, చంద్రబాబుకు దగ్గర బందువు. చాలా ఏళ్ళు ఆయన టీడీపీలో పనిచేశారు. ఆ బందుత్వం ద్వారానే జూనియర్ ఎన్టీఆర్‌కు తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఎన్టీఆర్ పెళ్లి అయ్యాక పరిస్థితులు మారిపోయాయి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు పూర్తిగా దూరం జరిగిపోయారు. ఆయన ఇంతవరకు టీడీపీలో కనిపించలేదు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మామ సైతం వైసీపీలో చేరిపోయారు. కానీ పార్టీలో చేరిన రాజకీయాల్లో మాత్రం యాక్టివ్‌గా ఉండటం లేదు. చూడాలి మరి నెక్స్ట్ ఎన్నికల్లోనైనా ఎన్టీఆర్ మామ యాక్టివ్ అవుతారేమో. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: