తండ్రికి బ్లాక్ ఫంగస్.. కొడుకు ఏం చేసాడో తెలుసా?
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. మొన్నటివరకు కరోనా వైరస్ శరవేగంగా పాకిపోయి ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది అయితే ప్రస్తుతం ప్రజలందరూ వైరస్ పట్ల అవగాహనతో ఎంతో ధైర్యంగా వైరస్ పై పోరాటం చేస్తున్నారు. ఇక మనోధైర్యంతో వైరస్ ను జయిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మనుషుల ప్రాణాలను బలి తీసుకోవడానికి బ్లాక్ ఫంగస్ అనే మరో మహమ్మారి కూడా సిద్ధమైంది. ప్రస్తుతం శరవేగంగా పోతూ ఎంతోమందిని బెంబేలెత్తిస్తోంది. ప్రాణాంతకమైన మహమ్మారి కరోనా ను జయించాము అన్న ఆనందాన్ని ఎక్కువ రోజులు మిగల్చడం లేదు. అంత లోనే బ్లాక్ ఫంగస్ ఎటాక్ చేస్తుంది.
ఇక ఇటీవలే బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించడంతో ఏకంగా కన్నా కొడుకే తండ్రిని వదిలేసి వెళ్ళిపోయిన ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈనెల 3వ తేదీన కరోనా వైరస్ బారిన పడిన 63 ఏళ్ల చంద్రయ్య అనే వ్యక్తి ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఇటీవలే అతనిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. ఈ క్రమంలోనే వైద్యులు అతనిని వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలి అంటూ కొడుకుకూ సూచించారు. ఇక తండ్రి విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన కొడుకు.. ఇక ఆ వృద్ధుడిని అక్కడనే వదిలేసి వెళ్లిపోయాడు చివరికి కొడుకు కోసం పడిగాపులు కాస్తున్న చంద్రయ్యను ఆస్పత్రి సిబ్బంది వేరే ఆస్పత్రికి తరలించారు.