బ్లాక్ మెయిల్ చేస్తున్న విదేశీ వ్యాక్సిన్ కంపెనీ ?

VAMSI
ఈ కరోనా లాంటి ప్రాణాంతకమైన వైరస్ రావడం వలన మన దేశం చాలా దారుణమైన పరిస్థితులను చవిచూసిందని చెప్పాలి. ఈ వైరస్ కు విరుగుడుగా మన దేశానికి చెందిన సీరం ఇన్స్టిట్యూట్ మరియు భారత్ బయోటెక్ లాంటి కంపెనీలు వ్యాక్సిన్ ఉత్పత్తి చేయకపోయి ఉంటే, ఈ కరోనా పరిస్థితులను వాడుకుని విదేశీయులు మనల్ని బానిసలుగా చేసుకునేవారేమో ? మన పట్ల అతి దుర్మార్గంగా వ్యవహరించే వారేమో ?  ఈ విషయం తలుచుకుంటేనే కొన్ని సార్లు చాలా భయం వేస్తుంది. ఇంతకు ముందు వరకు అన్ని వ్యాక్సిన్ లను మనము ఇతర దేశాల నుండే కొనుక్కునే వాళ్లము. ఎప్పుడూ ఇంత వేగంగా వ్యాక్సిన్ ను కనిపెట్టిన పరిస్థితులు లేవు.

వాస్తవంగా ఒక వ్యాక్సిన్ ను ఒక కంపెనీ తయారుచేసిందంటే, అది 100 శాతం సమర్థవంతంగా పనిచేయగలగాలి. అంతే కానీ ఈ వ్యాక్సిన్ వలన బ్రతుకుతారో లేదో ? పనిచేస్తుందో లేదో ? అన్న మాటలు ఉండకూడదు. ఇప్పుడు వ్యాక్సిన్ మొదటి సారి వేసుకున్న వారికీ కరోనా పాజిటివ్ వచ్చింది. అలాగే వ్యాక్సిన్ సెకండ్ డోస్ వేసుకున్న వారికీ కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ ప్రభావం చాలా తక్కువగా ఉంది. కానీ దీనిపై వ్యతిరేక ప్రచారం పెద్ద స్థాయిలో జరిగింది. దాని ప్రభావమే వ్యాక్సిన్ వచ్చిన మొదటి రెండు మూడు నెలలు చాలా వ్యాక్సిన్ లు వృధా అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఫైజర్ వ్యాక్సిన్ కంపెనీ తీవ్రంగా రెచ్చిపోతోంది. ఇది ఏ స్థాయిలో ఉందంటే ఫైజర్ వ్యాక్సిన్ ను అర్జెంటీనాకు ఇవ్వడానికి రెండు రకాల షరతులను పెడుతోంది.

ఒకటి ఈ వ్యాక్సిన్ వలన భవిష్యత్తులోఎటువంటి దుష్ప్రభావాలు వచ్చినా ఫైజర్ ది బాధ్యత కాదు. అలా జరిగిన నష్టాలను భరించడానికి అర్జెంటీనా ఆర్మీ కి చెందిన ఆస్తులను మిలిటరీ బేస్ లో పెట్టాలని షరతులు పెట్టింది. ఈ విధంగా ఫైజర్ కంపెనీ తన విశ్వరూపాన్ని చూపెడుతోంది. కానీ మనం మాత్రం వారు పెట్టే ఈ షరతులకు లొంగకపోగా, మనమే కొన్ని షరతులను పెడుతున్నాము. ఫైజర్ వ్యాక్సిన్ 90 శాతం అక్యురసీ గా చెప్పబడుతోంది. కాగా కోవిషీల్డ్ మరియు కోవ్యాక్సిన్ వేసుకున్న వారిలో కరోనా వచ్చింది కేవలం 0.01శాతం మాత్రమే. అయితే కొంతమంది చెబుతున్న ప్రకారం ఇప్పటికిప్పుడే వ్యాక్సిన్ వేసుకోకున్నా ఎవ్వరూ చనిపోరు అని, ఈ విధంగా అన్ని వ్యాక్సిన్ కంపెనీలు బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఉన్నాయి. వాటన్నిటికీ తలొగ్గకుండా మెల్లగా ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: