పెంపుడు జంతువులకు కరోనా టీకా.. ఎగబడుతున్న జనాలు?

praveen
ప్రపంచవ్యాప్తంగా వాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. నిన్నటి వరకు ప్రపంచాన్ని మొత్తం కరోనా వైరస్ గడగడలాడించిన నేపథ్యంలో ఇక ఈ మహమ్మారి వైరస్ ను ఎదుర్కొనేందుకు  అందరిలో రోగనిరోధక శక్తిని పెంచే విధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా కొనసాగిస్తున్నాయి అన్ని దేశాల ప్రభుత్వాలు. ఇక కొన్ని దేశాలలో అయితే దాదాపుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావచ్చింది. అయితే ఇటీవలి కాలంలో అటు జంతువులకు కూడా కరోనా టీకా అందించడం ఎంతో ఉత్తమం అని పరిశోధకులు అభిప్రాయం పడిన నేపథ్యంలో ఇక ఇటీవలే దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా మొదలయింది రష్యాలో.



 జంతువులకు సంబంధించిన కరోనా టీకా పై ఎన్నో రోజుల నుంచి పరిశోధనలు జరుపుతున్న రష్యా ఇక ఇటీవల అధికారికంగా పెంపుడు జంతువులకు టీకా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.  ప్రపంచంలోనే తొలిసారిగా జంతువులకు కరోనా టీకా ప్రారంభించి రికార్డు సృష్టించింది రష్యా. ఒక జంతువులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంలో భాగంగా తొలి విడతలో 17వేల డోసులను అందుబాటులోకి తీసుకువచ్చింది.  కార్ని వాక్ కోవ్ పేరిట అభివృద్ధి చేసిన ఈ టీకా ద్వారా ఆరు నెలల వరకు వైరస్ నుంచి జంతువులకు రక్షణ లభిస్తుంది  అంటూ రష్యా మీడియా చెప్పుకొచ్చింది.



 అయితే ఈ టీకా క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా కుక్కలు, పిల్లులు, నక్కలు లాంటి జంతువుల పై ప్రయోగాలు చేసినట్లు పరిశోధకులు తెలిపారు. ఇక ఈ క్లినికల్ ట్రయల్స్ లో సత్ఫలితాలు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇక పెంపుడు జంతువులకు కరోనా టీకా ఇచ్చేందుకు రష్యా ప్రభుత్వం సిద్ధం కావడంతో ఇక అక్కడి ప్రజలందరూ తమ పెంపుడు జంతువులకు టీకా వేయించేందుకు తరలి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరికొన్ని రోజుల్లో పెంపుడు జంతువులకు టీకా వేయడం ఇతర దేశాలలో కూడా ప్రారంభం అయ్యే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: