20 మందితో పెళ్లి చేసుకోమంటే.. 200 మందిని పిలిచాడు.. చివరికి?
అయితే ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడి కోసం ఎన్నో చర్యలు చేపడుతున్నప్పటికీ అటు ప్రజలు వ్యవహరిస్తున్న తీరు మాత్రం కరోనా పెరిగిపోవడానికి కారణంగా మారిపోతుంది. ఎంతోమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లలో ప్రభుత్వం విధించిన నిబంధన ప్రకారం కేవలం 20 మందితో కాకుండా ఎక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు. ఇక ఇటీవలే ఏకంగా వరుడు ఇలా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఏకంగా 2 లక్షల జరిమానా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కేవలం 20 మంది సమక్షంలో మాత్రమే పెళ్ళి చేసుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినప్పటికీ.. వరుడు మాత్రం రూల్స్ బ్రేక్ చేశాడు. ఏకంగా 200 మంది ని పిలిచి మరి పెళ్లి చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే రూల్స్ బ్రేక్ చేసిన వారికి రెండు లక్షల జరిమానా విధించారు. ఈ ఘటన ఏపీ లోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం లోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు పోలీసులు రెండు లక్షల జరిమానా విధించడంతో వరుడు కాస్త తెల్లమొహం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.