అదిరిపోయే ఆఫర్.. 5లక్షల లోన్.. ఆరు నెలలు నో ఈఎంఐ?

praveen
ప్రస్తుతం రోజురోజుకు బ్యాంకింగ్ రంగంలో పోటీ పెరిగి పోతుంది. ఈ క్రమంలోనే అన్ని రకాల బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు ఇతర బ్యాంకులతో పోల్చి చూస్తే మెరుగైన సర్వీసును అందించాలని ఎప్పటికప్పుడు వినూత్న మైన సర్వీస్ను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రస్తుతం బ్యాంకులు తమ కస్టమర్లకు ఎన్నో రకాల రుణ సదుపాయాలను కూడా కనిపిస్తున్నాయి. పర్సనల్ లోన్, కార్ లోన్,ఎడ్యుకేషనల్ లోన్, హోమ్ లోన్ ఇలా ఎన్నో రకాల రుణ సదుపాయాలను తమ కస్టమర్లకు కల్పిస్తున్నాయి అన్ని రకాల బ్యాంకులు. ఒకప్పుడు అప్పు కావాలి అంటే పక్కవారినో ఎదురింటి వాళ్ళనో అడిగే వాళ్ళం కానీ ఇప్పుడు అప్పు వద్దన్నా సరే ఇచ్చేస్తున్నాయి బ్యాంకులు.



 ఇటీవలే కెనరా బ్యాంక్ తమ కస్టమర్ల కోసం కీలక నిర్ణయం తీసుకొని సరికొత్త స్కీమ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. కెమెరా చికిత్స హెల్త్ కేర్ క్రెడిట్ ఫెసిలిటీ కింద రిజిస్టర్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, డయాగ్నస్టిక్స్ సెంటర్ లు, ల్యాబ్స్, ఇతర హెల్త్కేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏకంగా పది లక్షల నుంచి 50 కోట్ల వరకు రుణాలు పొందేందుకు అవకాశం కల్పిస్తుంది కెనరా బ్యాంక్. ఇక తక్కువ వడ్డీ రేటుకి ఈ రుణాలను అందించేందుకు సిద్ధమైంది. అయితే ఇక ఈ రుణాలను పదేళ్లలో తిరిగి చెల్లించే అవకాశం ఉంది. 18 నెలల వరకు కూడా మారటోరియం పెట్టుకునేందుకు వెసులుబాటు కూడా ఉంది.



 అదే సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు, మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సెంట్రేట్ లు వంటివి తయారు చేసే సంస్థలకు కెనరా బ్యాంక్ రెండు కోట్ల వరకు రుణాలు అందించేందుకు సిద్ధమైంది. కెనెరా జీవనరేఖ హెల్త్ కేర్ బిజినెస్ లోన్ కింద ఈ తరహా రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇక ఈ లోన్ పొందాలనుకునే వారికి మరో శుభవార్త ఏంటి అంటే ఈ రుణం పై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఇక అంతే కాకుండా కెనరా బ్యాంక్ తమ కష్టమర్లందరికీ ఆర్థిక సమస్యలను తీర్చేందుకు ఐదు లక్షల వరకు పర్సనల్ లోన్స్ అందిస్తోంది. ఇక ఈ పర్సనల్ లోన్ లో ఆరు నెలల పాటు ఈఎమ్ఐ కట్టాల్సిన పనిలేదు. సెప్టెంబర్ 30 వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. అంతే కాదు పర్సనల్ లోన్స్ కి ప్రాసెసింగ్ ఫీజు మాఫీ బెనిఫిట్ కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: