80ఏళ్ల క్రితం విసిరిన బాంబులు.. ?
అసలు ఈ బాంబులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకుందాం. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ దళాలు యూరోపియన్ దేశాలపై భారీగా దాడులు చేశాయి. అలాంటి ప్రాంతాల్లో బ్రిటన్‌లోని ఎక్సెటర్ కూడా ఒకటి. ఈ ప్రాంతంలో చేసిన దాడి వ్యూహంలో భాగం కాదట. అనుకోకుండానే ఇక్కడ దాడి చేశారంట. అలాగే లూబెక్‌పై బ్రిటన్ బాంబు దాడులకు ప్రతీకారంగా, జర్మనీ సేనల్లో ఉత్సాహం నింపడం కోసం ఎక్సెటర్ ప్రాంతంలో బాంబుల వర్షం కురిపించింది హిట్లర్ సైన్యం. అదే ఇక్కడి దాడికి కారణం.
అయితే అప్పుడు హిట్లర్ సేనలు వేసిన బాంబులు చాలావరకు పేలలేదు. నిపుణుల అంచనా ప్రకారం, కనీసం 10శాతం బాంబులైనా పేలకుండా అలాగే ఉండిపోయాయి. ఎక్సెటర్‌లో చేసిన దాడిలో 7వేల హైఎక్స్‌ప్లోజివ్ బాంబులు, ఇన్సెండియరీ బాంబులు ఉపయోగించింది హిట్లర్ సైన్యం. అయితే ఆ పేలని బాంబులు భూమిలో కప్పుకుపోయాయి. తాజాగా ఓ ఇంటి కోసం తవ్వకాలు జరపగా ఆ బాంబులు బయట పడ్డాయి.
దీంతో ఈ విషయం తెలుసుకున్న అధికారులు.. వెంటనే బాంబు ఉన్న ప్రాంతం నుంచి ప్రజలందరినీ వెల్లగొట్టారు. అత్యంత జాగ్రత్తగా భద్రతా చర్యలు తీసుకొని ఆ బాంబును పేల్చేశారు. ఇలాంటి బాంబులు కనిపించడం చాలా అరుదన నిపుణులు చెబుతున్నారు. ఇలా జర్మనీ చేసిన దాడుల్లో చాలా ప్రాంతాల్లో బాంబులు పేలకుండా అలాగే ఉండిపోయి ఉంటాయని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. దీంతో జనాలు భయానికి గురవుతున్నారు. ఇంత పెద్ద బాంబులు పొరపాటున పేలుంటే పరిస్థితి ఏంటా అని అంతా అనుకుంటున్నారు.