గర్భవతిని చేసి మోసం చేశాడు.. మాజీ మంత్రి పై నటి ఆరోపణలు?
తనను పెళ్లి చేసుకోవాలని అడిగితే తనకు అబార్షన్ చేయించి ఇక గర్భం తీయించడమే కాదు. ప్రశ్నించిన తన కుటుంబ సభ్యులను సైతం బెదిరించాడు అంటూ ఆరోపించింది తమిళ నటి. ఇక ఇటీవల ఈ విషయంపై డీజీపీకి ఫిర్యాదు చేశారు నటి శాంతిని ఆ తర్వాత విలేకరుల సమావేశంలో తమ ఐదేళ్ల బంధం గురించి చెప్పుకొచ్చారు గతంలో 2017 లో ఐటీ మంత్రిగా ఉన్న మణికందన్ తనను కలిశారని.. అప్పటికే ఆయనకు వివాహం అయ్యింది అని.. అయినప్పటికీ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడని.. ఆ తర్వాత చెన్నై లోని బసంత్ నగర్ లో సహజీవనం కూడా చేసాము అంటూ చెప్పుకొచ్చింది.
మణికందన్ కారణంగా తాను మూడు సార్లు గర్భం దాల్చానని అయినప్పటికీ వివాహం తర్వాత సంతానం గురించి ఆలోచిద్దాం అంటూ నమ్మబలికి అబార్షన్ చేయించాడు అంటూ తెలిపింది. 2021 ఏప్రిల్లో మణికందన్ తనను దూరం పెడుతూ వచ్చాడని.. అంతే కాకుండా దేశం విడిచి వెళ్లి పోవాలంటూ ఒత్తిడి కూడా తీసుకొచ్చాడు అంటూ నటి ఆరోపించింది. ఒకవేళ తాను చెప్పినట్లు చేయక పోతే తన నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పెడతానంటూ కుటుంబ సభ్యులను సైతం బెదిరించాడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఇక తమిళ నటి చేసిన వ్యాఖ్యలు కాస్త తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారిపోయాయి. అయితే తమిళ నటి ఆరోపణలపై స్పందించిన మాజీమంత్రి వాటిని మణికంఠ తోసిపుచ్చారు.