సెంట్రల్ విస్టాకు గ్రీన్ సిగ్నల్.. పిటీషనర్ కి షాక్..
ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్టు అత్యవసరమైన ప్రాజెక్టు కాదని..కొంతకాలం తాత్కాలికంగా దీన్ని నిలుపుదల చేయడం ద్వారా వచ్చే నష్టమేమీ లేదని చెప్పడం జరిగింది.ఇక సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను కొంత కాలం తాత్కాలికంగా ఆపేస్తే కార్మికులతో పాటు స్థానిక ప్రజలకు కరోనా మహమ్మారి నుంచి రక్షణ లభిస్తుందని పేర్కొనడం జరిగింది.అయితే ఇక సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులకు విఘాతం కలిగించేందుకు దురుద్దేశంతో ఈ పిల్ దాఖలు చేశారని కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తంచేయడం జరిగింది.ఇక అటు సెంట్రల్ విస్టా ప్రాజెక్టును చేపడుతున్న షపూర్జి పల్లోంజి కంపెనీ కూడా పిల్‌ను వ్యతిరేకించింది. అలాగే కార్మికులు కొవిడ్ బారినపడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపడం జరిగింది. ఇక దీనిపై విచారణ జరిపిన హైకోర్టు చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని బెంచ్..మే 17న తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది.