అదిరిపోయే ప్యాకేజి.. వ్యాక్సిన్ తో పాటు?
రోగాన్ని కూడా సుఖంగా ఎంజాయ్ చేసే విధంగా ఈ ప్యాకేజీలను స్టార్ హోటల్స్ ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వాక్సినేషన్ ప్రక్రియ దేశంలో శరవేగంగా కొనసాగుతోంది.. అయితే ఇక ఎన్నో ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సిన్ అందిస్తున్నారు. అదే సమయంలో ప్రైవేట్ ఆసుపత్రిలో సైతం వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇలాంటి నేపథ్యంలోనే ప్రస్తుతం కొన్ని ప్రైవేట్ ఆస్పత్రిలు స్టార్ హోటల్స్ తో జత కట్టి ఇక హోటల్స్ లోనే వ్యాక్సిన్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ లగ్జరీ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆపాలంటూ అటు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
కానీ ప్రైవేటు వాక్సినేషన్ కు అనుమతి ఉన్న నేపథ్యంలో ఇక కొన్ని రకాల స్టార్ హోటల్స్ వ్యాక్సిన్ తో పాటు మరిన్ని సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. మూడున్నర వేల రూపాయలు చెల్లిస్తే వ్యాక్సిన్ వేయడంతోపాటు ఒకరోజు ఏసీ గదుల్లో ఎంతో హాయిగా ఉండొచ్చు. అంతేకాకుండా ఐడున్నర వేల రూపాయలు చెల్లిస్తే వ్యాక్సిన్ వేయడంతో పాటు ఒక రోజు పాటు హోటల్ లో ఉండే అవకాశం అంతేకాకుండా ఇక కావలసిన అన్ని రకాల అన్ని రకాల ఆహారాలు కూడా ఉచితంగా ఇస్తారు. ప్రస్తుతం దేశంలోని మహానగరాల్లో ఈ లగ్జరీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. అటు ఎంతో మంది జనాలు కూడా ఈ లగ్జరీ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.