కేటీఆర్.. మీలాంటి లీడర్.. మా రాష్ట్రానికి కావాలి..!?
ఇలా కొన్ని రోజులుగా ఆయన ట్విట్టర్ అకౌంట్ కు ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. ఒకటి కాదు.. రెండు కాదు.. రోజూ వందల్లో విజ్ఞప్తులు వస్తున్నాయి. వాటిని ఆయన వెంటనే సంబంధిత అధికారులకు పంపుతూ ఫాలో చేస్తున్నారు. అందుకే ఇప్పుడు నెటిజన్లు కేటీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ప్రశంసల్లో కొందరు ఇతర రాష్ట్రాల వారు కూడా ఉంటున్నారు.
బాధితులు ఏ రాష్ర్టానికి చెందినవారైనా స్పందిస్తున్న కేటీఆర్ చర్యలకు పలువురు ఫిదా అయిపోతున్నారు. కేటీఆర్.. మీరు సూపర్.. మీలాంటి లీడర్ మా రాష్ట్రానికీ ఉంటే ఎంత బావుంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ట్విట్టర్‌లో నిరంతరం అందుబాటులో ఉంటూ కరోనా బాధితులకు అండగా నిలుస్తున్న మంత్రి కేటీఆర్‌పై ఇలా ప్రశంసల జల్లు కురుస్తోంది. సోమవారం వెస్ట్‌బెంగాల్ రాష్ర్టానికి చెందిన అభినవ్ భట్టాచార్య మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి ఓ ఆసక్తికరమైన ట్వీట్‌చేశారు.
‘కేటీఆర్.. మీరు మానవులేనా లేక సూపర్ పవర్స్ ఉన్న బోటా? దయచేసి మీ ప్లాస్మాను ఇతర రాజకీయ నాయకులు, మంత్రులకు ఇవ్వండి. ఎందుకంటే మీలాంటి మంత్రులు కావాలి. మీకు, మీ కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీసులు ఉండాలి. లవ్ ఫ్రమ్ వెస్ట్‌బెంగాల్’ అంటూ ట్వీట్ చేశాడు. అలాగే.. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఈఆర్ ఆకిబ్ సైతం కేటీఆర్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. కేటీఆర్ సర్ మీ లాంటి లీడర్ జమ్ముకశ్మీర్‌లోనూ ఉండాలని ఆకాంక్షిస్తున్నా. లాట్స్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ సర్ అంటూ ట్వీట్ చేశాడు.