అయ్యబాబోయ్.. నడిరోడ్డుపై ఎలియన్.. హడలెత్తిస్తున్న వీడియో?
ఎందుకంటే అప్పుడప్పుడు ఏలియన్స్ తమ స్పేస్ షిప్ లలో వచ్చి చక్కర్లు కొడుతున్న వీడియోలు సోషల్ వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అదే సమయంలో కొన్ని కొన్ని సార్లు నిర్మానుష్య ప్రాంతంలో భయంకరమైన రూపం కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇటీవలే జార్ఖండ్ లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన అందరూ కూడా హడలెత్తిపోతున్నారు.
ఇక ఇది చూస్తున్నంతసేపు అందరిలో ఒకే ఒక ప్రశ్న మెదులుతుంది. ఈ వీడియోలో ఉన్నది దయ్యమా లేకపోతే ఏలియనా అన్నది అర్థం కాక అందరూ జుట్టు పీక్కుంటున్నారు. జార్ఖండ్‌లోని హజారీబాగ్ లో అర్ధరాత్రి సమయంలో బ్రిడ్జి మీద ప్రయాణిస్తున్న కొందరు ఒక వింత జీవి ని చూశారు. ఆ వింత జీవి అర్ధరాత్రి నడుచుకుంటూ వెళుతోంది. దీంతో వెంటనే ఫోన్లో ఇదంతా చిత్రీకరించారు m ఒళ్ళంతా తెల్లగా దయ్యం ఆకారంతో నడుచుకుంటూ వెళుతోంది. ఇక ఈ వీడియోలో ఉన్నది దయ్యం అని కొంతమంది అంటుంటే.. లేదు గ్రహాంతరవాసి అని మరి కొంతమంది అంటున్నారు. ఇంతకీ ఇది ఏంటి అన్న దానిపై మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది.