గుంటూరు అర్బన్ ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ నియామిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆరిఫ్ హఫీజ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏఎస్పీగా ఉన్నారు . కాగా సడెన్ గా ప్రభుత్వం గుంటూరు అర్బన్ ఎస్పీగా అమ్మిరెడ్డి స్థానంలో ఆరిఫ్ హఫీజ్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది . ఎస్పీ అమ్మిరెడ్డికి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరింగింది. రఘురామ కృష్ణం రాజు వివాదంలో అమ్మిరెడ్డి పేరు ఎక్కువ వినపడుతుంది. రాజద్రోహం కేసులో బెయిల్పై బయటికి వచ్చిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మొన్న రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. మొదట జగన్ సర్కార్ పై ఫిర్యాదు చేసేందుకు వచ్చారని భావించినప్పటీ ఆ తరవాత.. .. తనను ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసి వెంటనే ఏపీ సీఐడీకి అప్పగించాలని ముగ్గురు అధికారులు కుట్ర పన్నారని రఘురామ సంచలన ఆరోపణలు చేశారు .
సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డి తనను త్వరగా డిశ్చార్జ్ చేయాలని వైద్యులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు . అంతే కాకుండా కేపీ రెడ్డి, గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, టీటీడీ ఏఈవో ధర్మారెడ్డి తనను ఏపీ సీఐడీకి అప్పగించేందుకు కుట్రపన్నారని రఘురామ రాజ్ నాథ్ సింగ్ కు ఫిర్యాదు చేశారు. తనను డిశ్చార్జ్ చేసిన వెంటనే అదుపులోకి తీసుకోవాలని మఫ్టీలో పోలీసులను పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దానికి కేపీ రెడ్డి సహకరించారని...ఆర్మీ ఆస్పత్రి రిజిస్ట్రార్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రఘురామ కేంద్రమంత్రిని కోరారు. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తన కేసుకు సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రఘురామ ఇచ్చిన ఫిర్యాదు కారణంగానే ఇప్పుడు ఎస్పీ అమ్మిరెడ్డిని వెనక్కిపంపించినట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .