ఊహించని షాక్ ఇచ్చిన చైనా.. తెల్లమోహం వేసిన ఇమ్రాన్?

praveen
ఎప్పుడు ఇతర దేశాలపై ఎలా దాడులు చేయాలా.. ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉద్రిక్త పరిస్థితులు సృష్టించాలా అని కుట్రలు పన్నే పాకిస్తాన్ తమ దేశ ఆర్థిక పరిస్థితి గురించి గాని.. ప్రజల గురించి గానీ పట్టించుకోలేదు.  కనీసం తమ దేశంలో ఉన్న ప్రజలకు ఉద్యోగ, ఉపాధి కల్పన మౌలిక వసతుల కల్పన విషయంలో కూడా ఎప్పుడు ఏమి చేపట్టలేదు పాకిస్తాన్  అదే సమయంలో ఇక ఇతర దేశాల నుంచి అప్పులు తీసుకుంటూ చివరికి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.



 అయితే మొన్నటి వరకు ఇస్లామిక్ దేశాలు మొత్తం పాకిస్తాన్ కి ఆర్థిక సహాయం కావలసినప్పుడల్లా అప్పు ఇస్తూ వచ్చాయి. కానీ ఇటీవల ఆర్థిక సాయం చేస్తున్న ఇస్లామిక్ దేశాల పైన ఆధిపత్యం చెలాయించాలని చూడటంతో చివరికి సౌదీ అరేబియా లాంటి దేశాలు పాక్ కి దూరం కావడంతో చివరికి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది పాకిస్తాన్. ఇక ఇప్పుడు ఆర్థిక సహాయం కావాలి అంటే కేవలం చైనా పైనే ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చైనా దగ్గర ఎన్నో వందల కోట్ల అప్పులు చేసిన పాకిస్తాన్ ఇప్పటికీ అవసరమైనప్పుడల్లా చేయి చాస్తూనే ఉంది.



 అయితే ఇటీవలే మరోసారి పాకిస్తాన్ చైనా ముందు చేయి చాచగా ఇక మిత్ర దేశమైన చైనా పాకిస్తాన్ కు ఊహించని షాక్ ఇచ్చింది. సిపెక్ కు సంబంధించిన 31 బిలియన్ డాలర్ల హక్కులను రీ స్ట్రక్చర్  చేయాలి అంటూ చైనా అడిగింది పాకిస్థాన్. కానీ పాకిస్తాన్ రిక్వెస్ట్ ను చైనా రిజెక్ట్ చేసింది. కాగా మరోవైపు పాకిస్థాన్ అప్పులు అంతకంతకూ పెరిగి కొండంత అవుతున్నాయి  2020 డిసెంబర్ నాటికి 294 బిలియన్ డాలర్లకు చేరాయి పాకిస్థాన్ అప్పులు. ఇక పాకిస్తాన్ జీడీపీ తో పోల్చి చూస్తే అప్పుల ఎక్కువగా  ఉన్నాయి. ఇటు సిపెక్ ప్రాజెక్టుకు ఇప్పటివరకు ముప్పై ఒక్క బిలియన్ డాలర్లకు మించిపోయాయి ఖర్చులు. ఇలా రోజురోజుకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పాకిస్తాన్ కు చైనా ఒకటే సాయం చేస్తూ ఉండగా ఇక ఇప్పుడు చైనా కూడా మొండి చేయి చూపడంతో పాకిస్తాన్ కి ఊహించని షాక్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: