జగన్ మళ్ళీ ఏసేశాడు.. ఆనందయ్య మందుని వదల్లేదు?

praveen
జగన్ అధికారం లోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టారు .. ప్రతి పథకానికి తన తండ్రి వైఎస్సార్ లేదా తన పేరు పెట్టుకున్నారు. అయితే అధికారం లోకి వచ్చిన పార్టీ నేతలు అందరూ ఇలా తమ పేరు పెట్టు కోవడం కామనే కానీ.. జగన్ ప్రవేశ పెట్టని పథకాలకు సైతం జగన్ తన పేరును పెట్టుకోవడం తో కొన్ని సార్లు విమర్శల పాలయ్యారు.  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు జగన్ తన పేరు పెట్టి తన ఫోటో పెట్టి పూర్తిగా తానే ప్రవేశ పెట్టినట్లు ప్రచారం చేస్తున్నారు.  జగన్ ఇలా ప్రచారం చేసి పూర్తిగా ఎక్కడ కేంద్ర ప్రభుత్వం పేరు ఎత్తకుండా ఉండడం తో ఇక బీజేపీ గతంలో తీవ్ర స్థాయిలో జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేసింది.



 ఇక ఇప్పుడు జగన్ ప్రభుత్వం మరోసారి ఇలాంటి పని చేసే తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది.  ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా పట్టణం లో ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు కరోనా వైరస్ కు మందు కనుగొన్నాడు. ఇక ఈ మందు ఎంతో సమర్థవంతం గా పని చేస్తూ ఉండడం తో ప్రస్తుతం ప్రభుత్వం పరీక్షల అనంతరం ఈ మందు పంపిణీ కి అనుమతి ఇచ్చింది. ఆనందయ్య మందును ఆన్లైన్లో ఇస్తామంటూ ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది.



 దీని కోసం ఒక ప్రత్యేకమైన యాప్ కూడా ఉంది అంటూ తెలిపారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ఆ యాప్ ఓపెన్ చేయగానే ఆనందయ్య ఫోటో ఎక్కడో చివర ఉంటే.. ఇక జగన్ ఫోటో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫోటోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా ఆనందయ్య మందుకు కూడా  జగన్ స్టిక్కర్ వేశారు. దీనిపై అటు విశ్లేషకులు మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏమాత్రం సరైనది కాదు అంటూ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: