దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది . కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది . కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ విధించడం వల్ల ప్రభుత్వాలు ఆర్ఙికంగా వెనకబడి పోతున్నాయి . కేవలం కరోనా నే కాకుండా ఇప్పుడు బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ అంటూ ఇతర రోగాలు కూడా చుట్టు ముడుతున్నాయి . దాంతో ఎంతో మంది బాధితులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రెటీలు ప్రముకులు ముందుకు వచ్చి కరోనా కట్టడి కోసం విరాళాలు అందజేస్తున్నారు . కరోనా నియంత్రణలో భాగమవుతున్నారు . కాగా తాజాగా కోవిడ్ నియంత్రణలో భాగంగా అమరరాజా గ్రూప్ సంస్థల ఎండి గల్లా రామచంద్ర నాయుడు కూడా తమవంతు సాయం చేశారు . కరోనా కట్టడి కోసం ఒక కోటి రూపాయలు విలువచేసే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను మరియు ఇతర వస్తువులను చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగానికి అమర రాజా అందజేసి గొప్ప మనసును చాటుకున్నారు .
కలెక్టరేట్ లో జరిగిన ఈ కార్యక్రమంలో అమర రాజా సంస్థ ప్రతినిధులు , ప్రజా ప్రతినిధులు మరియు జాయింట్ కలెక్టర్ రాజశేఖర్ కు వైద్య ఉపయోగకర వస్తువులను అందజేశారు . ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ .... .కోవిడ్ లో ప్రజలను కాపాడేందుకు అమర్ రాజా కంపెనీ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు . స్వచ్ఛంద సంస్థలు , ఎన్ఆర్ఐలు కూడా కోవిడ్ నియంత్రణకు వివిధ రకాల వస్తువులను అందించారని తెలిపారు . దాతలు అందించిన వైద్య పరికరాలను వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అవసరం మేరకు కోవిడ్ ఆస్పత్రులకు, ఐసోలేషన్ వార్డులకు అందజేయడం జరుగుతుందన్నారు . అమర్ రాజా కంపెనీ స్ఫూర్తితో మరికొందరు దాతలు ముందుకు రావాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు .