బాబు గారూ.. టీకా వేయించుకున్నారా లేదా.. వైసీపీ సూటి ప్రశ్న?
ఇలాంటి నేపథ్యం లోనే వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితం అని ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు అని ప్రజలందరిలో నమ్మకం కలిగించేందుకు ఎంతో మంది ప్రజా ప్రతినిధులు టీకా వేసుకుని ప్రజలందరిలో ధైర్యం నింపారు. ముఖ్యం గా 65 సంవత్సరాలకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సమయంలో.. మొదటగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాక్సిన్ వేసుకొని టీకా విషయంలో ఉన్న అనుమానాలను పటాపంచలు చేశారు. అయినప్పటికీ అటు సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు.. ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో పూర్తిస్థాయి అనుమానాలు మాత్రం తొలగిపోలేదు.
ఇలాంటి నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. మంత్రులు సైతం వ్యాక్సిన్ వేసుకొని ప్రజల్లో వ్యాక్సిన్ పై నమ్మకం పెంచేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే దాదాపు అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకున్నారు. కాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీకా వేసుకున్నారా లేదా అనే దానిపై ఆసక్తికర చర్చ మొదలైంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిపై ప్రశ్నించింది. చంద్రబాబు ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా అనే విషయాన్ని ప్రశ్నించారు మంత్రి కన్నబాబు. దీంతో ఈ విషయంపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ మొదలైంది. చంద్రబాబు సమాధానం చెప్పాల్సి ఉంది.