‘RRR’ థీమ్ తో పర్యావరణ దినోత్సవ కార్యక్రమాలు..!
ఇప్పటికే మానవులు చేస్తున్న తప్పిదాల వల్ల భూతాపం పెరగి పోయి పర్యావరణంలో చాల రకాల పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో చాలా రకాల జీవరాశుల మనుగడే ప్రశ్నార్థకం అవుతోంది. ఇంకో వైపు రోజురోజుకూ వాతావరణంలో మార్పులు పెరిగి జీవ వైవిధ్యం పూర్తిగా దెబ్బతింటోంది. పెద్ద పెద్ద చెట్లను ఇష్టం వచ్చినట్టు నరికివేస్తున్నందున అడవులు చాలా వరకు అంతరించిపోతున్నాయి. సరైన వర్షాలు లేక కరువుకాటకాలు సంభవిస్తున్నాయి ఇప్పుడు దేశంలో. దీంతో జల వనరులు నానాటికీ తగ్గిపోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే వస్తున్న వాతావరణ సంక్షోభం మన జీవితాల్లో కొన్ని కోలుకోలేని మార్పులను తీసుకొస్తోంది. అనేక రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ నిర్మూలన, ప్లాస్టిక్ వ్యర్థాలు వంటి సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేకమైన కార్యక్రమాల గురించి ఈ రోజు వివరిస్తోంది ఐక్యరాజ్యసమితి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏటా జూన్ 5న నిర్వహిస్తున్నారు ప్రపంచ పర్యావరణ వేత్తలు, ప్రజలు.
ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) ద్వారా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 1972 జూన్ 5వ తేదీ నుంచి 16వ తేది వరకు మానవ పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి సమావేశం జరిపి అనేక రకాల సూచనలు చేస్తోంది. ప్రతి ఏటా ఒక్కో థీమ్‌ను ఎంపిక చేసి పర్యావరణ దినోత్సవం నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. 2019 సంవత్సరంలో ‘బీట్ ఎయిర్ పొల్యూషన్’పేరుతో చైనాలో ఈ పర్యావరణ సదస్సు జరిపారు ప్రపంచ పర్యావరణ వేత్తలు. ఇక 2020లో ‘టైమ్ ఫర్ నేచర్.’ జర్మనీ సహకారంతో కొలంబియాలో ఈ సద్సును నిర్వహించారు. అయితే ఈ ఏడాది మాత్రం rrr థీమ్‌తో పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఐక్యరాజ్యసమితి నిర్వాహాకులు. అంటే “Reimagine.. Recreate.. Restore” పునరాలోచన.. పున:సృష్టి.. పునరుద్ధరణ అనే నినాదంలో ఈ సదస్సును 2021కి నివేదించారు.