చెరుకు రసంతో పొట్ట తగ్గుతుందా.. ఇది తెలుసుకోండి?
ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎంతోమంది బాగా లావు పెరిగిపోవడంతో పొట్ట కొండంత అవుతుంది. దీంతో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తర్వాత పొట్ట తగ్గడం, బరువు తగ్గడం కోసం వ్యాయామ శాలల చుట్టూ తిరుగుతున్నారు. అయితే కొన్ని రకాల చిట్కాలు పాటించడం వల్ల సహజంగానే శరీరంలో పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చెరుకు రసం తాగడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది అంటూ చెబుతున్నారు నిపుణులు. ఫైబర్ ముఖ్యమైన పోషకాలతో ఉండే చెరుకు రసం బరువు తగ్గించగలదు అని చెబుతున్నారు.
ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో చెరుకురసం ఎంతో సమర్థవంతంగా పని చేస్తుంది అని నిపుణులు సూచిస్తున్నారు. చెరుకు రసంలో ఫ్లేవనాయిడ్స్ , పాలి ఫినోలిక్ కాంపౌండ్ లు యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయని ఇవన్నీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి మరింత చురుకుగా మారడానికి కూడా ఉపయోగపడతాయి అని చెబుతున్నారు నిపుణులు. ఇక ఇలా రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల వ్యాధులకు దూరంగా ఉండొచ్చు అని సూచిస్తున్నారు. అందుకే ప్రతి రోజూ ఒక గ్లాస్ చెరుకు రసం తాగితే ఎంతో మంచిదని సూచిస్తున్నారు.