ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఎందుకంత ఖర్చు.. ఓ చేదు నిజం..?
ఒక హాస్పిటల్ ఒక సీటీ స్కాన్ మిషన్ కొనాలంటే బయటి దేశాలనుంచి మాత్రమే కొనాలి. అది ఎంత దశలో ఉంటుందంటే ఆ మిషన్ లో చిన్న స్క్రూ పోయినా మన దేశంలో అది దొరకదు. వెంటనే కస్టమర్ కేర్ నంబర్ కి స్క్రూ పోయిందని ఫోన్ చేస్తే అది ఏ అమెరికాకో, ఇంగ్లండ్ కో, దక్షిణ కొరియాకో పోవాల్సిందే..అక్కడినుంచి మాత్రమే ఆ స్క్రూ రావాల్సిందే.
ఇపుడొక హాస్పిటల్ 64 slice fully loaded సీటీ స్కాను కొనాలి అనుకుందనుకుందాం. దాని ఖరీదు ఏడు కోట్లు. దానిలో సగం 3.5 కోట్లు హాస్పిటల్ పెట్టుకుంటే మిగిలిన సగం బ్యాంకు "లోను" ఇస్తుంది. ఎలా ఇస్తుంది?. 3.5 crores స్థిర ఆస్తులను పూచీకత్తుగా పెడితేనే ఇస్తుంది. ఆ మెడికల్ కి సంబంధించిన మిషన్ రావడానికి పన్నులు కూడా విపరీతంగా ఉంటాయి. వాటిని కొన్ని గవర్నమెంట్లు చాలా తక్కువగా ఉంచేవి. కానీ 1991 నుంచి ఈ టాక్సులను బాదడం మాత్రమే ప్రభుత్వాలు చేశాయి తప్ప ఏ రోజూ వీటిని తగ్గించింది లేదు.
కొన్ని ప్రభుత్వాలు మెడికల్ ఎక్విప్మెంట్ ని కూడా కమర్శియల్ గూడ్స్ గా చూడటం మొదలుపెట్టాయి. మన బడ్జెట్లలో ఇంపోర్ట్ టాక్స్ ల వేరియేషన్స్ ని పరిశీలించండి. ఏ ప్రభుత్వాలూ కనికరం చూపలేదు కొన్ని తప్ప. ఇపుడు బ్యాంకు ఇచ్చిన లోనుకు హాస్పిటల్ ఎంత కట్టాలో తెలుసా? నెలకు దాదాపు 22 లక్షలు కట్టాలి. మిషన్ వచ్చిన మరుసటి నెలనుంచే ఈ మొత్తం కట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు మెడికల్ ఎక్విప్మెంట్ లోన్లు "ఈఎంఐ"ల విషయంలో ఏ రోజూ ఆసుపత్రులకు అనుకూలంగా లేవు. అన్ని లోన్లకంటే ఈ మెడికల్ ఎక్విప్మెంట్ లోన్లపైనే బాదడం మొదలెట్టాయి.
అంతే కాక ఆ మిషన్ మెంటెనెన్స్ కు రేడియాలజిస్టులూ, స్టాఫూ, ఆ హై ఎండ్ కంప్యూటర్ మిషినరీకి, అది లాగే హై వోల్టేజీ కరెంటు ఖర్చులకూ అంతా కలిపి నెలకు ఎనిమిది లక్షలు ఖర్చు వస్తుంది. అంటే ఒక సీటీ స్కాను కొంటే నెలకు ఖచ్చితంగా ముప్పైలక్షల రూపాయలు దాని మీద రాబడి రాకపోతే అది కొనడం వలన ఆసుపత్రి నష్టాల్లోకి పోవడం తప్ప మరో మార్గం లేదు. అంటే ఈ లెక్కన రోజుకి లక్ష రూపాయలు రావాల్సిందే. ఒక సీటీ స్కాను బ్రెయిన్ రెండు వేలరూపాయలనుకుంటే... దానిలో రిఫరల్ డాక్టర్ కి డబ్బులు పోను మిగిలేది 1200 రూపాయలు. అంటే రోజుకి దాదాపు 85 సీటీ బ్రెయిన్‌లు చేస్తే తప్ప నోలాస్ నో ప్రాఫిట్ కింద సీటీ స్కాన్ మిషన్ మెంటెయిన్ కాదు. ఇది ఓ డాక్టర్ ఇచ్చిన వివరణ.