బర్డ్ వాచ్.. ట్విట్టర్లో కొత్త ఫీచర్.. ఇక ఆటలు సాగవు?

praveen
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు చదువుకున్న వాళ్ళ దగ్గరనుంచి చదువు లేని వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్  వాడకం పెరిగిపోవడం అదే సమయంలో ఎంతో తక్కువ ధరకే టారిఫ్ రీఛార్జి ఉండడంతో ప్రస్తుతం అందరూ సోషల్ మీడియాలో గంటల తరబడి కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ప్రపంచంలో ఎక్కడో జరిగిన విషయం కూడా నిమిషాల వ్యవధిలో అందరికీ తెలిసిపోతుంది. ఇలా సమాచారాన్ని తెలుసుకోవడంలో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తోంది.



 కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఏకంగా సోషల్ మీడియాలో వస్తున్న నిజమైన వార్తల కంటే ఫేక్ వార్తలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎంతోమంది ఫేక్ న్యూస్ ని వైరల్ చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయ్. ఈ ఫేక్ న్యూస్ కారణంగా ఎన్నో ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి.  ఈ క్రమంలోనే ఇక ఫేక్ న్యూస్ ను అరికట్టేందుకు ఇప్పటికే పలు రకాల సోషల్ సంస్థలు నడుం బిగించాయి.  ఇక తమ తమ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో  ఫేక్ న్యూస్ లు వస్తే వాటిని గుర్తించి ముందుగానే వాటిని డిలీట్ చేసే విధంగా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.



 ఇక ఇప్పుడు ఎంతో ప్రజాదరణ కలిగిన ట్విట్టర్ కూడా తమ వినియోగదారులకు ఫేక్ న్యూస్ తలనొప్పిని తప్పించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బర్డ్ వాచ్ పేరుతో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది ట్విట్టర్. ఇక ట్విట్టర్ తీసుకువచ్చిన ఈ సరికొత్త ఫీచర్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ వర్షన్ లో కొంతమందికి పైలెట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ట్విట్టర్ వేదికగా ఇకనుంచి వినియోగదారులు  అనుమానాస్పద గుర్తిస్తే  సరైన కారణం తెలుపుతూ ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత ట్విట్టర్ రంగంలోకి దిగి అది ఫేకా నిజమైన న్యూసా అనే విషయాన్ని తేలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: