ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్‌ను రద్దు చేసిన రాష్ట్రాలు!
గుజరాత్ లో సెకండరీ, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏటా నిర్వహించే గుజరాత్ క్లాస్ 12 స్టేట్ బోర్డ్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12 వ తరగతి ఎగ్జామ్స్‌పై స్పష్టతనిచ్చింది. ఆ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదే బాటలో ఉత్తరాఖండ్ సీఎం కూడా విద్యార్థులు, ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు ఇంటర్మీడియట్ క్లాస్ 12 బోర్డు పరీక్ష 2021 ను రద్దు చేసి, అందరికీ గుడ్ న్యూస్ చెప్పారు. ఇకయూపీలో యూపీ బోర్డు క్లాస్ 10తో పాటు క్లాస్ 12 బోర్డు ఎగ్జామ్స్‌పై యోగిఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు వీటిని రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు.
అలాగే రాజస్థాన్‌లో ఆర్బిఎస్ ఈ 10, 10 వ తరగతి ఎగ్జామ్స్‌ను క్యాన్సిల్ చేశారు. హర్యానా లో స్కూల్ 12 బోర్డ్ ఎగ్జామ్స్‌ను, గోవాలో బోర్డ్ ఆఫ్ సెకండరీతో పాటు హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి పరీక్షలను క్యాన్సిల్ చేశారు అధికారులు. ఇక ఇదే బాటలో కర్ణాటక II పీయు ఎగ్జామ్స్ రద్దయ్యాయి. మహారాష్ట్రలో 10, 12వ తరగతుల పరీక్షలను విజ్ఞప్తుల మేరకు రద్దు చేశారు. ఇక ఒడిశాలో కూడా ఒడిశా క్లాస్ 12 బోర్డు ఎగ్జామ్స్‌పై ప్రభుత్వం క్లారిటీ ఇస్తూ వీటిని రద్దు చేసింది. మన తెలంగాణలో కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ను కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికే టెన్త్, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే.