గుడ్ న్యూస్! ఆంధ్రాలో భారీగా తగ్గిన కేసులు...
ప్రస్తుతం చూసుకుంటే రాష్ట్రంలో 1,14,510 యాక్టివ్ కరోనా కేసులు నమోదవ్వగా ,గత 24 గంటల్లో కరోనా మహమ్మారితో పోరాడుతూ 86మంది చనిపోవడం జరిగింది.ఇక ఎక్కువగా చిత్తూరు జిల్లాలో 13మంది చనిపోగా, గుంటూరు జిల్లాలో 10, అనంతపురం జిల్లాలో 9, శ్రీకాకుళం జిల్లాలో 9, విజయనగరం జిల్లాలో 7, పశ్చిమగోదావరి జిల్లాలో 7, ప్రకాశం జిల్లాలో 6, విశాఖపట్నం జిల్లాలో 6, తూర్పుగోదావరి జిల్లాలో 5, కృష్ణా జిల్లాలో 5, కర్నూలు జిల్లాలో 5, నెల్లూరు జిల్లాలో నలుగురు చనిపోయారు. ఇక ఇప్పటి దాకా కరోనా మహమ్మారితో 11,552మంది మృతి చెందడం జరిగింది.
ఇక ఆంధ్ర ప్రదేశ్ లో జిల్లాల వారీగా కేసులు చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో 535. చిత్తూరు జిల్లాలో 961. తూర్పు గోదావరిలో 810. గుంటూరు జిల్లాలో 374. వైఎస్ఆర్ కడప జిల్లాలో 404. కృష్ణా జిల్లాలో 175. కర్నూలు జిల్లాలో 212. ప్రకాశం జిల్లాలో 447. శ్రీకాకుళం జిల్లాలో 166. విశాఖపట్ణణం జిల్లాలో 189. విజయనగరం జిల్లాలో 207.పశ్చిమ గోదావరి జిల్లాలో 160. ఇక మొత్తం జిల్లాల కేసులు 4872 వున్నాయి . ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 17,60,316 పాజిటివ్ కేసులు నమోదవ్వగా అందులో 16,34,254 మంది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది.