యువకుడి పాడు పని.. గంజాయి మత్తులో నడిరోడ్డుపైనే బట్టలిప్పి?
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ యువకుడు మాత్రం మాత్రం సాగలేదు ఏకంగా గంజాయి మత్తులో ఫుల్లుగా మద్యం తాగిన ఓ యువకుడు రోడ్డు మీదికి వచ్చి వీరంగం సృష్టించాడు. వచ్చే పోయే వాహనాలను ఆపుతూ అటు అసభ్యకరమైన పదజాలంతో ఎవర్నో తిడుతూ హల్చల్ చేశాడు. అంతేకాదు పోలీసులు వచ్చిన భయపడేది లేదు అంటూ ఏకంగా ఒక కారు ఎక్కి కూర్చున్నాడు. దీంతో ట్రాఫిక్ కి ఎంతగానో అంతరాయం కలిగింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అయితే అతను అలా ఊరికే అలా వచ్చి వీరంగం సృష్టించలేదు.. ఏకంగా ఒంటి మీద ఉన్న బట్టలు మొత్తం తీసేసాడు.
కరీంనగర్లోని తెలంగాణ చౌక్ వద్ద ప్రధాన రహదారిపై వెళ్లే వాహనాలను అడ్డుకుని కారు పైకి ఎక్కి ఏకంగా చుక్కలు చూపించాడు కిక్కు వీరుడు. ఇక కార్ ముందుకు వెళుతుంటే కారు ఆపేందుకు కార్ కిందికి దూరేందుకు ప్రయత్నించాడు. దాదాపు గంట సేపటి వరకు ఇలా హంగామా సృష్టించాడు ఈ గంజాయి బాబు. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇక అతన్ని పట్టుకున్నారు. ఇక ఆ తర్వాత అతని వివరాలు ఆరా తీయగా... అతని పేరు రాజు అని వరంగల్ జిల్లా నర్సంపేట సమీపంలో ఉన్న ఒక మారుమూల గ్రామానికి చెందినవాడు అన్న విషయాన్ని గుర్తించారు పోలీసులు. గంజాయి కి అలవాటు పడి చివరికి మత్తులో వీరంగం సృష్టించినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు .